క్రీడాభూమి

పోలాండ్‌పై సెనెగెల్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 19: ఫిఫా వరల్డ్ కప్ 2018 చరిత్రలో తొలిసారిగా గెలిచిన ఆఫ్రికా దేశంగా సెనెగెల్ ఘనత సాధించింది. మంగళవారం ఇక్కడి స్పార్టాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పోలాండ్‌ను 2-1 తేడాతో ఓడించింది. గ్రూప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలాండ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై గెలుపు కోసం దాడులకు తెగబడింది. అయితే సెనెగెల్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. ఆట ప్రథమార్ధంలో సెనెగెల్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో 37వ నిమిషంలో పోలాండ్ ఆటగాడు తియాగో సియోనెక్ ఓన్ గోల్ చేయడంతో సెనెగెల్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆట ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి తలపడ్డాయి. సెనెగెల్ జట్టు ఫార్వార్డర్ నియాంగ్ ఎంబాయె నియాంగ్ 60వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ ముగుస్తున్న క్రమంలో పోలాండ్ మిడ్‌ఫీల్డర్ క్రైచోయాక్ 86వ నిమిషంలో గోల్ చేశాడు. ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో సెనెగెల్ విజయావకాశాన్ని చేజిక్కించుకుంది.