క్రీడాభూమి

సమురాయ్‌లు సాధించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్నాస్క్: బ్లూ సమురాయ్ వీరులు కసితీర్చుకున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా కొలంబియాను వెంటాడి వెంటాడి మట్టికరిపించారు. దీంతో ఫిఫా ప్రపంచ కప్ 2018లో ఆసియా జట్టు జపాన్ శుభారంభం చేసినట్టయ్యింది. గ్రూప్-హెచ్‌లో దక్షిణ అమెరికా జట్టు కొలంబియాను ముప్పుతిప్పలు పెట్టి 2-1 స్కోరుతో జపాన్ ఆధిక్యతను నిలుపుకుంది. జపాన్ ఆటగాడు ఓసాకో 73వ నిమిషంలో చేసిన గోల్‌తో, బ్రెజిల్ 2014 వరల్డ్ కప్ గ్రూప్ దశలో 4-1 స్కోరుతో చవిచూసిన ఓటమికి బదులు తీర్చుకుంది. 2018 ఫిఫా వరల్డ్ కప్‌లో తన కల సాకారం చేసుకోవాలనుకున్న జపాన్ ఆశలకు కొలంబియాపై విజయం కొత్త ఊతమిచ్చినట్టయ్యింది. కేవలం ఫిఫా కోసమే ప్రత్యేకంగా నిమియతుడైన జపాన్ హెడ్ కోచ్ అఖిర నిషినో తన వ్యూహాన్ని సమర్థంగా అమలు చేసినట్టయ్యింది. ఇవన్నీ ఒకెత్తు, ప్రత్యర్థి జట్టు కొలంబియా ఆటగాళ్లు చేసిన పొరబాట్లు ఒకెత్తు. ప్రత్యర్థి ఆటగాళ్లు అనూహ్యంగా చేసిన పొరబాట్లు జపాన్‌కు బాగా కలిసొచ్చాయి. కష్టం, కాలం కలిసిరావడంతో గ్రూపు ఫేవరేట్‌గా బరిలోకి దిగిన కొలంబియాను ఆద్భుత పోరాట పటిమతో ఓడించి, జయహో జపాన్ అనిపించుకుంది.
ఆరంభం నుంచే హోరాహోరీ పోరాటంగా మొదలైన మ్యాచ్‌లో కొలంబియా డిఫెండర్ కార్లోస్ సాంచెజ్ బంతిని ఉద్దేశపూర్వకంగా చేతితో అడ్డుకోవడంతో రిఫరీ డామిర్ స్కోమినా కఠిన నిర్ణయమే తీసుకున్నాడు. రెడ్‌కార్డు చూపించి సాంచెజ్‌ను బయటకు పంపేయటంతో జపాన్ జట్టులో మరింత ఊపు కనిపించింది. ప్రథమార్థం ఆరంభంలోనే వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని జపాన్ సద్వినియోగం చేసుకుంది. మిడ్‌ఫీల్డర్ షింజి కగవా పెనాల్టీని గోల్‌గా మలచి జట్టును ఆధిక్యానికి చేర్చాడు. ఈ పరిణామంతో కంగుతిన్న కొలంబియా జట్టు మరింత కసిని ప్రదర్శించింది. బంతిని నియంత్రణలో ఉంచుకునేందుకు రెండు జట్లూ తీవ్ర పోరాట పటిమ ప్రదర్శించాయి. అలుపెరుగని పోరాటంలో కొలంబియా మిడ్‌ఫీల్డర్ జాన్ క్వ్రిన్‌ట్రో తన ఫ్రీకిక్‌తో బంతిని గోల్ చేసి 1-1స్కోరుతో జపాన్ ఉత్సాహాన్ని నీరుగార్చాడు. ద్వితీయార్థంలో రెండు జట్లూ ఆధిక్యత పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాయి. 73వ నిమిషంలో జపాన్ ఆటగాడు ఓసాకా గోల్ చేయడంతో జపాన్ 2-1 ఆధిక్యానికి చేరింది. జపాన్‌ను నిలువరించేందుకు కొలంబియా విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో 2-1 స్కోరుతో జపాన్ విజేతగా నిలిచింది.
సాంచెజ్ రెండోవాడు..
వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా రెడ్‌కార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో కొలంబియా డిఫెండర్ సాంచెజ్ ద్వితీయస్థానంలో నిలవక తప్పలేదు. 1986లో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్‌లో స్కాట్‌లాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో ఉరుగ్వే ఆటగాడు జోస్ బాటిస్టా 52 సెకెండ్ల వ్యవధిలోనే రెడ్‌కార్డుతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ రికార్డు తరువాత ఇప్పుడు కొలంబియా డిఫెండర్ సాంచెజ్‌కు అత్యంత వేగంగా రెడ్‌కార్డు తీసుకోవాల్సి వచ్చింది. జపాన్ ఆటగాడు ఓసాకో గోల్ కోసం బంతిని బలంగా తన్నినపుడు సాంచెస్ ఉద్దేశపూర్వకంగానే బంతిని చేత్తో ఆపాడు. వీడియో అసిస్టెంట్ రిఫరీ ఓపీనియన్ తీసుకోకుండానే, రిఫరీ డామిన్ స్కోమినా రెడ్‌కార్డు చూపించి సాంచెజ్‌ను బయటకు పంపేయడం రికార్డు అయ్యింది.