క్రీడాభూమి

రికార్డు రష్యా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం: మలి విడత గ్రూప్ మ్యాచ్‌లోనూ ఆతిథ్య దేశం రష్యా తన సత్తా చాటుకుంది. ప్రత్యర్థి జట్టు ఈజిప్ట్‌ను మట్టికరిపించి 3-1 స్కోరుతో ఆధిక్యంతో పరిగెడుతుంది. ఆట ప్రథమార్థంలో రెండు జట్లూ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. హోరాహోరీగా మొదలైన ద్వితీయార్థం ఆటలో 47వ నిమిషంలో ఈజిప్ట్ ఆటగాడు అహ్మద్ ఫతే సెల్ఫ్ గోల్ చేసి రష్యాను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ ఉత్సాహంతో 59వ నిమిషంలో డెనిస్ చెరిషేవ్, 62వ నిమిషంలో ఆర్టెమ్ జ్యుయెబాలు గోల్స్ సాధించి రష్యాను 3-0 ఆధిక్యానికి చేర్చారు. బంతిని నియంత్రణలోకి తీసుకున్న రష్యాను నిలువరించేందుకు ఈజిప్ట్ స్టార్ ఆటగాడు మహ్మద్ సలాహ్ విశ్వ ప్రయత్నం చేశాడు. 73వ నిమిషంలో గోల్ సాధించి ఈజిప్ట్‌ను గౌరవప్రద స్థానంలో నిలబెట్టాడు. ఆ తరువాత ఆటలో ఈజిప్ట్ జట్టు విఫలమవ్వడంతో వరుస రెండో విజయంతో ఆతిథ్య దేశం రష్యా ఆనందంలో మునిగిపోయింది.