క్రీడాభూమి

ఉరుగ్వేను గెలిపించిన సూరెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొస్టోవ్ ఆన్ డాన్, జూన్ 20: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం రాత్రి గ్రూప్-ఏలో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై ఉరుగ్వే 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ సౌతాఫ్రికన్ దేశ కీలక ఆటగాడు లూయిస్ సూరెజ్ ఉరుగ్వేను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇది సూరెజ్‌కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఆట ఆరంభం నుండే ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగింది. 23వ నిమిషంలో సూరెజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. బంతిపై నియంత్రణ కోసం ఒకపక్క, మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని మరోపక్క సౌదీ ఆటగాళ్లు విఫల యత్నం చేశారు. ద్వితీయార్ధంలోనూ ఇదే రీతిన పోటాపోటీ నెలకొంది. మ్యాచ్ ముగిసేసరికి ఏ జట్టు కూడా మరో గోల్ చేయకపోవడంతో ఉరుగ్వేను విజేతగా ప్రకటించారు. ఇదిలావుండగా, ఈజిప్టుపై తొలి మ్యాచ్‌లో గెలిచిన ఉరుగ్వే బుధవారం సౌదీపై మరో విజయంతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఉరుగ్వే తన తదుపరి మ్యాచ్‌లో గ్రూప్-బిలోని పోర్చుగల్, స్పెయిన్ లేదా ఇరాన్‌తో తలపడుతుంది. సౌదీ తొలి మ్యాచ్‌లో ఆతిధ్య రష్యా చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే.
ఆసియా గేమ్స్‌కు బాత్రా, శరత్
న్యూఢిల్లీ, జూన్ 20: రానున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే 10 మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల పరిమిత జాబితాను టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ జాబితాలో స్టార్ ఆటగాళ్లు మనీకా బాత్రా, ఆచంట శరత్ కమల్ చోటుదక్కించుకున్నారు. పురుషుల, మహిళల టీమ్‌లో సనీల్ శెట్టి, పూజా సహస్రబుద్ధి స్థానంలో మానవ్ ఠాకూర్, అహీకా ముఖర్జీలను ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఇండోనేషియాలో ఆసియా గేమ్స్ జరుగనున్నాయి.
ఐదేళ్ల కాలపరిమితితో మెన్స్
ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్: ఐసీసీ వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 20: ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే మెన్స్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగామ్ (ఎఫ్‌టీపీ)ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వెల్లడించింది. 2019 జూలై 15 నుండి 2021 ఏప్రిల్ 30 వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 టీమ్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లలో అర్హత సాధించేందుకు వివిధ దేశాల జట్లతో జరిగే వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతోపాటు వివిధ టీ-20 మ్యాచ్‌లలో క్వాలిఫయర్ కావాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లలో అర్హత సాధించిన జట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొమ్మిది టీమ్‌లు మాత్రమే 2023 వరకు జరిగే వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం ఉంది.