క్రీడాభూమి

స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కిడాంబి శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: భారత్ షటిల్ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి క్రీడాకారునిగా కొనసాగుతున్న కిడాంబి శ్రీకాంత్ మరో ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాడు. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ 2017 సంవత్సరానికిగాను శ్రీకాంత్‌ను ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. షటిల్ బ్యాడ్మింటన్‌లో అద్భుత ప్రదర్శనకుగాను అతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. షటిల్ బ్యాడ్మింటన్‌లో వరల్డ్ నెంబర్-4గా నిలిచిన కిడాంబి శ్రీకాంత్ పీటీఐతో మాట్లాడుతూ తనకు తాజా దక్కినది అవార్డు మాత్రమే కాదని, భవిష్యత్తులో మరింతగా బాగా కష్టపడి రాణించాలని, తద్వారా దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని చెబుతోందని అన్నాడు. అదేవిధంగా భారత మహిళా క్రికెట్ టీమ్ ‘టీమ్ ఆఫ్ ది ఇయర్’గా, జాతీయ ఫుట్‌బాల్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ ‘కోచ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. అదేవిధంగా వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన పలువురికి కూడా స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ వివిధ అవార్డులు ప్రకటించింది.
డోపింగ్ టెస్టులో విఫలం
పాక్ ఓపెనర్‌పై ఆరు నెలల సస్పెన్షన్
కరాచీ, జూన్ 21: పాకిస్తాన్ క్రికెట్ ఓపెనర్ అహమ్మద్ షెజాద్ డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో అతనిపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. 26 ఏళ్ల షెజాద్ తన క్రీడా జీవితంలో 13 టెస్టు, 81 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 57 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అతనిపై డోపింగ్ పరీక్షలు నిర్వహించామని, కానీ పూర్తిస్థాయి నివేదిక వచ్చేవరకు తామేమీ చెప్పలేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొంది. ఫైసలాబాద్‌లో ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన పాకిస్తాన్ కప్ వనే్డ టోర్నమెంట్ సందర్భంగా షెజాద్‌కు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా, అందులో పాజిటివ్ వచ్చిందని పీసీబీ తెలిపింది. కాగా, 2016 ఫిబ్రవరిలో సైతం పాకిస్తాన్ లెగ్‌స్పిన్నరర్ యాసిర్ షా డోపింగ్ టెస్టులో విఫలయం కావడంతో అతనిపై మూడు నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.