క్రీడాభూమి

ఇండియానే ఫేవరిట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 21: దుబాయ్‌లో శుక్రవారం నుంచి జరుగనున్న ఆరు దేశాల మధ్య జరిగే ‘కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ 2018’లో భారత్ జట్టు ఫేవరిట్‌గా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, ఇరాన్, కొరియా టీమ్‌లకు ఈ టోర్నమెంట్ అద్భుత అవకాశాలకు వేదిక కానుంది. ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి పాలెంబంగ్‌లో జరిగే టోర్నీలతోపాటు వచ్చే ఆసియా గేమ్స్‌లోనూ ఆయా జట్లు రాణించేందుకు దోహదపడుతుంది. వాస్తవానికి 1990 ఆసియా గేమ్స్‌లో కబడ్డీని తొలిసారిగా క్రీడగా గుర్తించి ప్రాతినిధ్యం కల్పించినప్పటి నుంచి భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా అవతరిస్తోంది. అప్పటినుంచి జరుగుతున్న ప్రతి టోర్నమెంట్‌లోనూ భారత్ జట్టు గోల్డ్ మెడల్‌ను సాధిస్తోంది. రానున్న భారీ టోర్నమెంట్‌లలో పాల్గొనే ఆసియా దేశాలకు దుబాయ్ కబడ్డీ మాస్టర్ టోర్నమెంట్ చక్కని వేదిక కానుందని భారత జట్టు కోచ్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపాడు. దుబాయ్‌లో జరిగే పోటీలో భారత్ పాకిస్తాన్‌తోపాటు కొత్త జట్టు కెన్యాతో కలసి గ్రూప్-ఏలో తలపడుతుంది. అదేవిధంగా గ్రూప్-బీలో ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, అర్జెంటీనా పోటీపడతాయి. ఈ రెండు గ్రూప్‌లలో పోటీపడే జట్లలో రెండు జట్లు సెమీఫైనల్‌లో తలపడతాయి. అయితే, ఈసారి జరిగే పోటీలో కొత్తగా అర్జెంటీనా ఆడడుతుండడంతో అందరి కళ్లూ ఆ జట్టుపై కూడా కేంద్రీకృతమై ఉన్నాయి.
చీఫ్ గెస్ట్‌గా రాజ్యవర్థన్ సింగ్
దుబాయ్‌లో శుక్రవారం జరుగనున్న ఆరవ కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ హాజరుకానున్నారు. ఈనెల 22 నుంచి 30వరకు ఆల్ వాస్ల్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి.