క్రీడాభూమి

నాకౌట్‌కు ఫ్రాన్స్ 1-0తో పెరూపై గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 21: సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం రాత్రి గ్రూప్-సీలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఫ్రాన్స్, పెరూ జట్లు తలపడగా ఫ్రాన్స్ 1-0తో గెలుపొంది నాకౌట్‌లో చోటుదక్కించుకుంది. ఆట ప్రారంభం నుంచే ఇరు జట్లు భీకరంగా తలపడినప్పటికీ అరగంట వరకూ ఎవరూ గోల్ చేయలేకపోయారు. ఇరు జట్లూ బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని విశ్వప్రయత్నం చేసినప్పటికీ వారి ఆశలు నెరవేరలేదు.
అయితే, ఆట 34వ నిమిషంలో ఫ్రాన్ మిడ్‌ఫీల్డర్ బప్పే గోల్ చేసి జట్టుకు తొలి ఆధిక్యం అందించాడు. రెండో గోల్ కోసం ఫ్రాన్స్ గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఆట ద్వితీయార్థం వరకు ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయాయి. చివరకు ఆట ముగిసేసరికి ఫ్రాన్స్ కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయడం, ప్రత్యర్థి పెరూ గోల్ చేయలేకపోవడంతో 1-0తేడా ఫ్రాన్స్ గెలిచింది.