క్రీడాభూమి

వనే్డల్లో రెండు బంతులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: వనే్డ క్రికెట్‌లో రెండు కొత్త బంతులు వినియోగించడం క్రికెట్ వినాశనానికి దారి తీస్తుందని భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రెండు బంతుల వినియోగం వల్ల బంతి పాతబడటానికి సమయం పడుతుంది. దీనివల్ల డెత్ ఓవర్లలో రివర్స్ స్వింగ్ అనేదే చూడలేకపోతున్నాం’ అంటూ సచిన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ ‘్ఫచ్ ఫ్లాట్‌గా ఉంటే ఈ పరిణామం మరీ దారుణం. మ్యాచ్ అంటేనే బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది’ అంటూ స్పందించాడు. ‘నిజానికి ఈ విధానం బౌలర్లకు భయానకం. ఒక్క కొత్త బంతితో వనే్డ క్రికెట్ ఆడటం వల్ల సగం ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి బంతి కాస్త పాతబడి, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండేది. మ్యాచ్‌లో రివర్స్ స్వింగ్ అనేది ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తుందన్నది అందరికీ తెలిసిందే’ అని కోహ్లి ప్రతి స్పందించాడు. తెండూల్కర్ ట్వీట్‌కు స్పందిస్తూ పాకిస్తాన్ రివర్స్ స్వింగ్ మాస్టర్ వకార్ యోనిస్ సమర్థించాడు. ‘అద్భుతమైన అటాకింగ్ బౌలర్లను తయారు చేయలేకపోవడానికి కారణం ఇదే. రెండు కొత్త బంతుల విధానం అమలైతే బౌలర్లు డిఫెన్స్‌లో పడిపోతారు. ఇది చాలా మార్పులు తీసుకొస్తుంది. రివర్స్ స్వింగ్ మాయమైపోతుందన్న వాదనతో నేనూ ఏకీభవిస్తున్నా సచిన్’ అంటూ సచిన్ ట్వీట్‌కు వకార్ రీట్వీట్ చేశాడు. ‘ఒక్కో సమయంలో పిచ్‌ల పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. పిచ్ పరిస్థితిని బట్టే ఆట సాగుతుంది. ఓడీఐల్లో రెండు కొత్త బంతుల గురించి నేనూ చదివాను. బౌలర్లకు ఇది కత్తిమీద సామేనన్న అంశంతో ఏకీభవిస్తాను’ అంటూ కోహ్లీ గట్టిగానే స్పందించాడు.