క్రీడాభూమి

ఫిట్‌నెస్‌పై డౌటే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: తన ఫిట్‌నెస్ మీద ఎలాంటి సందేహాలు అక్కర్లేదని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘నేను 90 శాతం మాత్రమే ఫిట్‌నెస్‌తో ఉండివుంటే, ఇంగ్లాండ్ సిరీస్‌కు వెళ్లేవాడినే కాదు. ఇప్పుడు 110 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు’ అని ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశాడు. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు శనివారం ఐర్లాండ్ పర్యాటనకు వెళ్తోన్న నేపథ్యంలో భారత జట్టు కోచ్ రవిశాస్ర్తీతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడాడు. ‘ముందుగానే వెళ్లి అక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటుపడాలనుకున్నా. కానీ, సాధ్యం కాలేదు. ఫిట్‌గా లేకపోవడమే కారణం కూడా. ఇప్పటికీ 90 శాతం ఫిట్‌నెస్‌తోనే ఉండివుంటే వెళ్లేవాడిని కాదేమో. ఇప్పుడు 110 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నానంటూ స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్ కోసం సాధన చేయడంతోపాటు అనేక ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నట్టు కోహ్లీ వివరించాడు. ‘అప్పుడప్పుడు ఇలాంటి విరామాలు ఆటగాడిని మానసికంగా బలోపేతం చేస్తాయి. ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుదామా? అని మనసు ఉవ్విళ్లూరుతోంది’ అంటూ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ఎలాంటి ప్రణాళికలతో వెళ్తున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ప్రత్యేకంగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. శ్రీలంక, దక్షిణాఫ్రికా పర్యనటకు వెళ్లినట్టే ఇప్పుడూ జట్టు బయలుదేరుతోంది. అయినా సిరీస్ సిరీస్‌కు ప్రణాళికలు మారిపోవు. ప్రత్యర్థిని దృష్టిలో పెట్టుకుని మైండ్‌సెట్‌ను మార్చుకోవడం ప్రమాదకరం. ఓర్పు, సహనం కరవైనపుడే అటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకే, మా దృష్టంతా ప్రత్యర్థిమీద కాదు మ్యాచ్‌మీద ఉంటుంది. ఓర్పుతో మ్యాచ్ ఎలా గెలవాలన్న అంశానే్న ఆలోచిస్తున్నాం’ అంటూ సమాధానమిచ్చాడు. మీ టార్గెట్స్ ఏమిటన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఈ ప్రశ్న గత టూర్‌కు వెళ్లినప్పుడూ ఎదుర్కొన్నా. ఇప్పుడూ అదే ప్రశ్న. దీనికి నా సమాధానం జస్ట్ కాఫీ తాగడానికని. నా ఆలోచనలు ఇలాగే వైవిధ్యంగా ఉంటాయి. ఏదైనా టూర్‌కు వెళ్లినపుడు ఆ దేశాన్ని ఎంజాయ్ చేస్తా. నేను సౌకర్యంగా, హాయిగావుంటే బాగా ఆడగలిగినట్టే లెక్క. చెప్పాలి కదా అని ఏదేదో చెప్పలేను. మిడిల్ ఆర్డర్ ప్లేయర్‌గా నేను అక్కడ ఏం ఫేస్ చేయాలో నాకు స్పష్టత ఉంది’ అంటూ కోహ్లి సమాధానమిచ్చాడు. డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగే తొలి టి20కి తాను కచ్చితంగా అందుబాటులో ఉంటానన్నాడు. ‘నేను టూరు కోసం నూరు శాతం సిద్ధంగా ఉన్నా. మెడగాయం నుంచి పూర్తిగా కోలుకున్నా. ముంబయిలో ఆరు నుంచి ఏడు ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరయ్యా. ఫాంలో ఉన్నా’ అంటూ కోహ్లి సమాధానమిచాచడు.
కోచ్ రవిశాస్ర్తీ మాట్లాడుతూ ప్రతి సిరీస్‌లోనూ ప్రతి గేమ్ తమకు ముఖ్యమేనంటూ సొంత మైదానంలో ఆడినట్టే ఆడతామన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు మొత్తం మంచి ప్రదర్శన ఇవ్వగలదన్న నమ్మకం తనకుందన్నాడు. దక్షిణాఫ్రిగా టూర్‌కు వెళ్లే సమయంలోనూ భారత జట్టుపై అనేక అనుమానాలు ముసురుకున్నాయని గుర్తు చేశాడు. అయితే మూడో టెస్ట్‌లో విజయం సాధించి, వెంటనే వనే్న, టి20 సిరీస్‌లు కైవసం చేసుకున్న విషయం గుర్తుంచుకోవాలన్నాడు. జట్టుగా ఆడటం ఎలాగో మనవాళ్లకు తెలుసు అని రవిశాస్ర్తీ కితాబునిచ్చాడు.
యోయో పాసై ఆడండి..
భారత జట్టు ఎంపిక కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ వ్యాఖ్యలపై కోహ్లి, రవిశాస్ర్తీ గట్టిగానే స్పందించారు. ఆటగాళ్ల ఎంపిక కోసం కేవలం యోయో టెస్ట్‌లనే ప్రాతిపదికగా తీసుకోవడం దారుణమంటూ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కోహ్లి, రవిశాస్ర్తీ స్పందిస్తూ ‘తప్పేముంది. ఫిట్‌నెస్ పరీక్షలో సమర్థత చూపించిన తరువాతే దేశం తరఫున ఆడాలి’ అంటూ స్పష్టం చేశారు. యోయో టెస్ట్ అనేది చాలా కష్టతరమైన అంశంగా భావోద్వేగాలకు గురికావడం సరికాదని, దీనివల్ల జట్టులో మానసిక స్థయిర్యం పెరుగుతుందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.