క్రీడాభూమి

పాక్ చిత్తు చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 22: కబడ్డీ మాస్టర్స్ చాంపియన్‌షిప్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాక్ జట్టును మట్టిగరిపించి అప్రతిహతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దుబాయి వేదికగా శుక్రవారం మొదలైన కబడ్డీ మాస్టర్స్ చాంపియన్‌షిప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ -పాక్ జట్లు తలపడ్డాయి. దాయాదుల మధ్య ఆసక్తికరమైన పోరును చూసేందుకు కబడ్డీ అభిమానులు ఎగబడటంతో అల్-వాస్ల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం కిక్కిరిసిపోయింది. భారత స్కిప్పర్ అజయ్ థాకూర్ సారథ్యంలో భారత ఆటగాళ్లు ఆరంభంనుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడటంతో మొదటి సగం ఆట పూర్తయ్యే సరికి 22-9 స్టోరుతో భారత్ ఆధిక్యతలో నిలబడింది. 15 రైడ్ పాయింట్లతో భారత జట్టు సారథి థాకూర్ ఇచ్చిన ఊపుతో మిగిలిన ఆటగాళ్లు రెచ్చిపోయారు. ప్రథమార్థంలోనే 13 పాయింట్ల ఆధిక్యంతో భారత్ నిలవడంతో, ద్వితీయార్థంలో పాక్ ఆటగాళ్లపై వత్తిడి కనిపించింది. స్కోరును సమం చేసేందుకు పాక్ జట్టు అటాక్‌కు దిగినా భారత్ తన పట్టు కొల్పోలేదు. ద్వితీయార్థంలో సంయమనాన్ని పాటించిన భారత్ జట్టు మ్యాచ్ ముగిసే సరికి 36-20 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ‘పాక్ ఆటగాళ్ల కార్నర్లను తుత్తునియలు చేసి వాళ్ల డిఫెన్స్‌ను బలహీనపర్చడంలో థాకూర్ అద్భుత ప్రతిభ కనబర్చాడు’ అంటూ మ్యాచ్ అనంతరం కోచ్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించాడు.

బోణీకొట్టిన నైజీరియా
వోల్గోగ్రాడ్, జూన్ 22: ఎట్టకేలకు ఫిఫా ప్రపంచ కప్‌లో నైజీరియా బోణీ కొట్టింది. గ్రూప్-డిలో ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 ఆధిక్యంతో తన సత్తా చాటుకుంది. 49వ నిమిషంలో నైజీరియా ఫార్వర్డర్ ముసా సాధించిన గోల్‌తో తన ఆధిక్యాన్ని చాటుకుంది. నైజీరియా విజయం సాధించటంతో ఈ గ్రూపులో అర్జెంటీనా నౌకౌట్ ఆశలు మరింత అడుగంటినట్టయ్యాయి.