క్రీడాభూమి

అర్జెంటీనా ఇంటికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోవ్‌గోరోడ్, జూన్ 22: అర్జెంటీనా అసలు ప్రతాపాలు అడుగంటాయా? స్టార్ ఆటగాడు మెస్సీమీద ఆశలు మసకబారుతున్నాయా? ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న అర్జెంటీనా కలలకు నిజ్ని నోవ్‌గోరోడ్ మైదానంలో క్రొయేషియా ఆటగాళ్లు ఉరేసేశారా? చాంపియన్స్ కావాలన్న కోటి ఆశలతో ప్రపంచ కప్ యుద్ధ్భూమిలోకి అడుగుపెట్టిన అర్జెంటీనా, తుది 16లో చోటు దక్కించుకోవడమే గగనమన్న దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోందా? ఫుట్‌బాల్ అభిమానుల వర్తమాన ప్రశ్నలకు గ్రూప్-డిలో భవిష్యత్ మ్యాచుల ఫలితాలే సమాధానమివ్వాలి. ఎందుకంటే -గ్రూప్ డి మలి మ్యాచుల్లో భాగంగా నిజ్ని నోవ్‌గోరోడ్ మైదానంలో తలపడిన అర్జెంటీనా- క్రొయేషియా హోరాహోరీ పోరులో అర్జెంటీనా దారుణంగా ఓడిపోయింది. 3-0 తేడాతో విజయం సాధించిన క్రొయేషియా నాకౌట్ దశకు చేరుకుంటే, ఈ గ్రూప్‌లో తరువాత జరిగే మ్యాచ్‌ల ఫలితాలే తన భవితవ్యాన్ని నిర్ణయించక తప్పదన్న దీనస్థితిలో అర్జెంటీనా ఉండిపోయింది. ఇప్పటికి రెండు మ్యాచులు ఆడిన అర్జెంటీనా ఒక్క మ్యాచ్ గెలుచుకుని కేవలం రెండు పాయింట్లతో మూడోస్థానంలో నిలబడటం ప్రపంచ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసే అంశం. గంటన్నరపాటు ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగిన పోరును స్టాండ్స్‌నుంచి ఆసక్తిగా తలకించిన అర్జెంటీనా మాజీ స్టార్ ఆటగాడు డిగో మారడోనా సైతం ఎదురైన ఘోర పరావభవాన్ని చూసి విలవిల్లాడాడు. కొన్ని క్షణాలపాటు షాక్‌లో ఉండిపోయాడు. నిజానికి ఆట మొదలైన తొలి అర్థ్భాగంలో అటు అర్జెంటీనాగాని, ఇటు క్రొయేషియాగానీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. తరువాత బంతిని నియంత్రణలోకి తీసుకున్న క్రొయేషియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. దూకుడుగా ఆడుతోన్న క్రొయేషియాకు అర్జెంటీనా గోల్‌కీపర్ విల్లీ కాబల్లెరో చేసిన చిన్న పొరబాటు పెద్ద అవకాశం ఇచ్చినట్టయ్యింది. దాన్ని క్రొయేషియా ఆటగాడు రెబెక్ సమర్థంగా వాడుకున్నాడు. 53వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని నెట్స్‌కి తన్ని 1-0తో క్రొయేషియాను ఆధిక్యంలో నిలబెట్టాడు. రియల్ మాడ్రిడ్ స్టార్ మోడ్రిక్ 80వ నిమిషంలో క్రొయేషియాకు మరో గోల్ అందించటంతో క్రొయేషియా వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి లేకుండాపోయింది. తీవ్ర వత్తిడికి గురైన అర్జెంటీనాను క్రొయేషియా ఆటగాళ్లు ఊపిరి తీసుకోనివ్వలేదు. ఆట ముగిసిపోతున్న సమయంలోనూ మెస్సీ బార్సిలోనా టీంమేట్ రాక్టిక్ మరో గోల్‌తో క్రొయేషియాను 3-0 ఆధిక్యానికి తీసుకెళ్లడంతో.. ఏం జరుగుతుందో అర్థంకానంత అయోమయంలో స్టాండ్స్‌లోని అభిమానులు నిశే్చష్టలై నిలబడిపోయారు. అర్జెంటీనాకు తుది 16లో చోటుపైనే సందిగ్దం తలెత్తడంతో అవమానభారంతో మైదానం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్-డిలో ఐస్‌లాండ్- నైజీరియా, అర్జెంటీనా- నైజీరియా మ్యాచుల ఫలితాలే అర్జెంటీనా భవితవ్యాన్ని తేల్చనున్నాయి.