క్రీడాభూమి

50 ఏళ్ల వరకూ ఆడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, జూన్ 23: తనకు 50 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆడతానని ప్రముఖ టెన్నిస్ స్టార్, సెర్బియా ప్రొఫెషనల్ ఆటగాడు నవోక్ జొకోవిచ్ అన్నాడు. తాజాగా క్వీన్స్ క్లబ్ సెమీ ఫైనల్స్‌లో 8-5, 6-1తో ఆడ్రియన్ మన్నారినోపై గెలుపొందడం ద్వారా 800 మ్యాచ్‌లలో ఘనవిజయాలు సాధించిన 10వ ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం 31వ పడిలో ఉన్న జొకోవిచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన జెరెమీ చార్డీతో సెమీఫైనల్స్‌లో తలపడనున్నాడు. ఇందులో గెలుపొందితే క్వీన్స్ టైటిల్‌ను తొలిసారిగా అందుకున్న ఘనత సాధిస్తాడు. ప్రపంచ మాజీ నెంబర్ వన్ కూడా అయిన జొకోవిచ్ ప్రస్తుతం పురుషుల ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో నిలిచాడు. ఇంతవరకు 12 గ్రాండ్ శ్లామ్‌లు, ఐదు ఏటీపీ వరల్డ్ ఫైనల్ టైటిల్స్, 30 మాస్టర్స్ థౌజండ్ సిరీస్ టైటిల్స్, 12 ఏటీపీ వరల్డ్ టూర్ 500 టోర్నమెంట్లలో ఘన విజయాలను సాధించాడు. వివిధ టోర్నమెంట్లు, మ్యాచ్‌లలో ఆడడం ద్వారా టెన్నిస్‌ను ఆస్వాదిస్తున్నానని, తనకు ఎంతో భవిష్యత్తు ఉందని, వయసేమీ మీదపడలేదని, కనీసం 50 ఏళ్లు వచ్చేవరకు టెన్నిస్‌లో కొనసాగాలని అనుకుంటున్నానన్నాడు.