క్రీడాభూమి

మ‘రోమేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 23: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో పనామాతో జరిగిన పోరులో రెండు గోల్స్ చేసిన బెల్జియం స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకు 3-0తో జట్టును గెలిపించాడు. ఇపుడు శనివారం టునీషియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో మరోసారి లోకానికి చాటిచెప్పాడు. టునీషియాతో గ్రూప్-జీలో జరిగిన మ్యాచ్‌లో రొమేలు మరింత రెచ్చిపోయి ఆడాడు. ఫలితంగా జట్టుకు వ్యక్తిగతంగా రెండు గోల్స్ చేశాడు. మరో ఇద్దరు స్ట్రయికర్లు అతనికి అండగా నిలిచి మరో మూడు గోల్స్ చేయడంతో బెల్జియం ప్రత్యర్థిపై 5-2 తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది.
ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా బెల్జియం ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. బంతిని ఎక్కువసేపు అదుపులో ఉంచుకోవడానికే బెల్జియం ఆటగాళ్లు ప్రయత్నించి టునీషియాపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఆట తొలి అర్ధ్భాగంలోనే బెల్జియం మూడు గోల్స్ చేసి టునీషియా ఆటగాళ్లపై పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. బెల్జియం ఆటగాడు లుకాకు (16, 45+3వ నిమిషాల్లో) రెండు అద్భుత గోల్స్ చేశాడు. జట్టు కెప్టెన్ ఈడెన్ హజార్డ్ (6వ, 51వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా, మరో స్ట్రయికర్ మిచీ బత్య్సూయి ఆట చివరి (90వ నిమిషం)లో మరో గోల్ చేసి జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడంతో బెల్జియం సునాయాసంగా నాకౌట్‌లో చోటుదక్కించుకుంది. మొదటి అర్ధ్భాగంలో కనీసం ఒక్క గోల్ చేయలేకపోయిన టునీషియా స్ట్రయికర్లు రెండో అర్ధ్భాగంలోనూ ప్రత్యర్థి దూసుకుపోతుండడంతో వారి దూకుడు నుంచి తప్పించుకుంటూ గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఫలితంగా బెల్జియంకు గోల్స్ చేయడానికి మరో అవకాశం ఇవ్వకుండా టునీషియా జట్టులో డ్యాలన్ బ్రూన్ (18వ నిమిషం), కెప్టెన్ వాహ్‌బి ఖజ్రీ (90+3 నిమిషంలో) రెండు గోల్స్ చేశారు. ఇదిలావుండగా, టునీషియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన బెల్జియం స్టార్ ఆటగాడు రొమేలు లుకాకు పోర్చుగల్ స్టార్ ఆటగాడు, ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న క్రిస్టియానో రొనాల్లో ఈ సీజన్‌లో ఇంతవరకు సాధించిన నాలుగు గోల్స్‌తో సమం చేశాడు.
పనామాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆటగాళ్లు నెమ్మదిగా ఆటను ప్రారంభించిన సమయంలో బెల్జియం కోచ్ రాబెర్టో మార్టినెజ్ విమర్శలు చేసినా ఆ తర్వాత జట్టు గెలవడంతో ఆటగాళ్లందర్నీ అభినందించిన విషయం తెలిసిందే.