క్రీడాభూమి

చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ సింధు ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్జూ (చైనా), ఏప్రిల్ 20: చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పివి సింధు ముందంజ వేసింది. మొదటి రౌండ్‌లో ఆమె నసుకీ సదైరాను 21-10, 21-12 తేడాతో ఓడించింది. మొదటి నుంచి ఆటపై పట్టు బిగించిన సింధు చివరి వరకూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ని పూర్తి చేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేశాడు. అతను మొదటి రౌండ్‌లో జూన్ వెన్ సూన్‌ను ఓడించిన అతను రెండో రౌండ్‌లో హువాంగ్ యూజియాంగ్‌పై 21-13, 21-11 తేడాతో విజయం సాధించాడు. తర్వాతి రౌండ్‌లో అతను డారెన్ లియూతో తలపడతాడు. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ జోప్రా, అక్షయ్ దివాల్కర్ జోడీ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మొదటి రౌండ్‌లో వీరు 21-18, 21-13 తేడాతో యాంగ్ కెయ్ టెర్రీ హీ, కియాన్ హియాన్ లో జోడీపై గెలుపొందారు. అయితే, మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ ఓటమిపాలై నిష్క్రమించింది. వీరిపై రూట్ బోచ్, ఆలివర్ లెడన్ డేవిస్ జోడీ 21-18, 21-13 తేడాతో గెలిచింది. మహిళల డబుల్స్‌లో జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ 21-16, 21-18 స్కోరుతో మెయ్ కువాన్ చౌ, మెంగ్ ఇయాన్‌లీ జోడీని ఓడించింది.
ఇతర కీలక మ్యాచ్‌లను పరిశీలిస్తే, మహిళల సింగిల్స్‌లో లీ జురుయ్ 21-6, 21-9 తేడాతో పై యూపోను చిత్తుచేయగా, పోర్న్‌టిప్ బురానప్రొసెర్ట్‌సక్ 21-10, 21-19 స్కోరుతో యుయ్ హషిమొతోపై విజయం సాధించింది. అయూమీ మిన్ 21-12, 21-15 తేడాతో షవో యున్ సింగ్‌ను, లీవెన్ మెయ్ 21-17, 21-13 ఆధిక్యంతో మిచెలే లీని, చెన్ యూఫై 21-11, 21-13 తేడాతో లియాంగ్ ఫెంగ్ హూను ఓడించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ లిన్ డాన్ 21-12, 21-10 స్కోరుతో చెంగ్ పోవెయ్‌పై, చెన్ లాంగ్ 21-11, 21-17 ఆధిక్యంతో రెన్ పెంబోపై, షియుకి 21-12, 21-19 తేడాతో షవో ససాకీపై విజయాలను నమోదు చేశారు.