క్రీడాభూమి

సిరీస్‌ను త్వరగా ముగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూలై 5: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. శుక్రవారంనాడు రెండో టీ-20 మ్యాచ్‌ను సైతం చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. ఈ రెండు జట్ల మధ్య మూడో టీ-20 ఈనెల 8వ తేదీన జరుగనున్న నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో మరోసారి విజయఢంకా మోగించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని ఉబలాటపడుతోంది. ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో జరిగిన రెండు వనే్డ మ్యాచ్‌లలో ఘన విజయాన్ని అందుకున్న భారత్ అదే ఊపుతో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ-20లో రాణించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించి నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకుని జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అదేవిధంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 101 అత్యధిక పరుగులు చేసి టీ-20లో వ్యక్తిగతంగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. టీమిండియా గత ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ-20 సిరీస్‌ను 2-1తో గెల్చుకుంది.
ఇంగ్లాండ్ ఇంతవరకు ఆడిన 10 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఐదింట్లో విజయం సాధించింది. భారత్‌తో జరిగిన తొలి టీ-20లో ఓటమిపాలైన ఇంగ్లాండ్ ప్రత్యర్థి జట్టులోని అత్యంత ప్రమాదకర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఏవిధంగా కట్టడి చేయాలన్నదానిపై ప్రణాళిక రచిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం జట్టు సభ్యులందర్నీ అన్నివిధాలా సంసిద్ధం చేశాడు. కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్‌తో టీ-20లలో ఆడడం ఇదే తొలిసారి కావడంతో అతని బౌలింగ్ సామర్థ్యాన్ని సరిగా అంచనా వేయడంలో తాము చాలా ఇబ్బంది పడ్డామని, కానీ తమ తదుపరి మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని విభాగాల్లో రాణించగలమనే ధీమాను వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. రెండో టీ-20లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఇయాన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్ వంటివారు ప్రత్యర్థి బౌలర్లను నిలువరించగలిగితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని మోర్గాన్ సేన యోచిస్తోంది. అయితే, టీమిండియాలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లలో ఏ ఒక్కరు గట్టిగా ప్రత్యర్థి బ్యాటింగ్ సరళిని దెబ్బతీసినా ఇంగ్లాండ్‌కు మరో పరాజయం తప్పదని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.