క్రీడాభూమి

ఉరుగ్వే-ఫ్రాన్స్ హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ్‌హ్నీ నొవ్‌గోరోడ్, జూలై 5: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో శుక్రవారం నాడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలను మెరుగుపరుచుకోవడం ద్వారా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టాలని యోచిస్తున్నాయి. ఉరుగ్వే జట్టులో స్టార్ స్ట్రయికర్ ఎడిన్‌సన్ కవానీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రష్యాతో జరిగిన ఒక మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చాడు. ఈ జట్టు కెప్టెన్ డిగో గోడిన్, జోస్ జిమినెజ్, మార్టిన్ కాసెరెస్, డీగో లక్సాల్ట్‌తోపాటు గోల్‌కీపర్ ఫెర్నాండో ముస్‌లెరా వంటివారు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వీరంతా సమష్టి కృషితో గ్రూప్ స్టేజీ నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు, ఇపుడు క్వార్టర్ ఫైనల్స్‌కు జట్టును తీసుకెళ్లే బాధ్యతలను మోశారు. ఉరుగ్వే, ఫ్రాన్స్ డిఫెన్స్ ఆడడంలో దిట్టగా పేరుగాంచాయి. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో ఉరుగ్వేతో తలపడుతున్న ఫ్రాన్స్ సైతం ప్రత్యర్థిపై సునాయాసంగా గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉంది. ఈ జట్టులో యువ సంచలన కీలియాన్ ఎంబప్పె కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఈ ఒక్కడు చాలు..ఉరుగ్వేను దెబ్బతీయడానికి అనే కోణంలో ఆలోచిస్తోంది ఫ్రాన్స్. క్వార్టర్ ఫైనల్స్‌లో తమ జట్టు కీలక ఆటగాడు ఎంబప్పెను ఏ విధంగా వాడుకోవాలి, ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలన్నదానిపై ఫ్రాన్స్ యోచిస్తోంది.