క్రీడాభూమి

మా కల నెరవేర్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజాన్, జూలై 5: ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో లీగ్ దశ ముగిసి, ప్రీ క్వార్టర్‌లో పోటీపడిన వివిధ జట్లు శుక్రవారం నుండి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఇందులో ప్రత్యర్థులపై గెలవడం ద్వారా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అన్ని జట్లు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్, బ్రెజిల్-బెల్జియం జట్లు క్వార్టర్ ఫైనల్స్ పోరులో పైచేయి కోసం పోరాడనున్నాయి. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌ను 3-2తో ఓడించిన బెల్జియం క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్‌తో తలపడనున్న తరుణంలో ఆ జట్టు కోచ్ రోబెర్టో మార్టినెజ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తమ చిరకాల కల నెరవేరబోతోందని అన్నాడు. బ్రెజిల్ ఏరకంగా చూసుకున్నా తమకంటే బలమైన జట్టు అయినా తమ విజయం ఖాయమని అన్నాడు. ఈ గెలుపుతో తమకు బంగారు భవితవ్యం రానుందని, ఇందుకు అనుగుణంగా తమ కుర్రాళ్లు అన్నివిధాలా సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. తమ జట్టులో ఎంతో ప్రతిభా సామర్థ్యాలు కలిగిన ఈడెన్ హజార్డ్ (చెలీసా), కెవిన్ డి బ్రూనే (మాంచెస్టర్ సిటీ), రొమేలు లుకాకు (మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్) వంటి ఆటగాళ్లు ఎంతోమంది తమకు బలమైన ఆయుధాలుగా ఉన్నారని అన్నాడు. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్‌లోని అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈనెల 15న మాస్కోలో జరిగే ఫైనల్స్‌లో తప్పకుండా చోటు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటికే మూడో ర్యాంకర్ బెల్జియం 2014లో కార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లగలిగింది. ఇక బెల్జియంతో తలపడే బ్రెజిల్ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో 2-0తో మెక్సికోపై ఘన విజయం సాధించింది. ఈ జట్టులో స్టార్ ఆటగాడు నేమార్, రోబెర్టో ఫిర్మినో చెరో గోల్ చేసి జట్టును క్వార్టర్ ఫైనల్స్‌లోకి తీసుకెళ్లారు. బ్రెజిల్‌లో జావో మిరండా, టియాగో సిల్వ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిస్తే సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్ లేదా ఉరుగ్వేతో ఫైనల్ పోరు కోసం తలపడుతుంది.
క్వార్టర్ ఫైనల్స్‌లో గెలుపు కోసం తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి పోరాడుతామని బ్రెజిల్ ఆటగాడు టియాగో సిల్వ గట్టి నమ్మకంతో ఉన్నాడు. తమ జట్టు ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌ను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నారని, వారంతా అన్ని విభాగాల్లో ప్రత్యర్థిని కట్టడి చేస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నాడు