క్రీడాభూమి

కీస్‌కు క్వాలిఫయర్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్, జూలై 6: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలన ఫలితం నమోదైంది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన యెవ్‌గెనియా రొడీనా మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 11వ సీడ్ మాడిసన్ కీస్‌కు షాకిచ్చింది. టోర్నమెంట్ నాలుగో రోజైన గురువారం డిఫెండింగ్ చాంపియన్ గార్బెన్ ముగురుజా పరాజయాన్ని చవిచూడగా, ఐదో రోజున కీస్ పెవిలియన్ చేరింది. ముగురుజాను రొడీనా 5-7, 6-2, 6-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది.
మొదటి సెట్‌లో ఓడినప్పటికీ, ధైర్యం కోల్పోకుండా, ఆతర్వాతి రెండు సెట్లలో ఆమె ఎదురుదాడికి దిగి, వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకొని, ముగురుజాను ఇంటిదారి పట్టించింది. ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండగా, తాజాగా కీస్ పరాజయం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. టైటిల్ వేటలో ఉన్న ఆమె రెండో రౌండ్‌లోనే వెనుదిరగడంతో, ఈసారి విజేత ఎవరనేది మరింత ఆసక్తికరంగా మారింది.
జ్వెరెవ్ ముందంజ
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో టేలర్ ఫిట్జ్‌ని ఓడించిన జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేశాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 6-4, 5-7, 6-7, 6-1, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఈసారి వింబుల్డన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత ఆసక్తికరంగా సాగిన పోరు ఇదే. కాగా, గేల్ మోన్ఫిల్ 5-7, 6-4, 6-4, 6-2 స్కోరుతో శామ్ క్వెర్రీపై విజయాన్ని నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో కెవిన్ ఆండర్సన్ 6-3, 7-5, 7-5 ఆధిక్యంతో ఫిలిప్ కొల్చ్‌బెరెర్‌పై గెలిచాడు.