క్రీడాభూమి

నిష్క్రమించిన సింధు, ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్త, జూలై 6: ఇండోనేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధు, ప్రణయ్‌లు ప్రత్యర్థుల చేతిలో ఓటమితో ఇంటిముఖం పట్టారు. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధుపై 14-21, 15-21 తేడాతో చైనాకు చెందిన బింగ్జియా విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సింధు ఎలాంటి పోటీని ఇవ్వలేకపోయింది. రెండు సెట్‌లలోనూ సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బింగ్జియా ఆధిక్యత ప్రదర్శించింది. ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ 17-21, 18-21 తేడాతో చైనా ఆటగాడు షీ యుకీ చేతిలో ఓటమితో టోర్నీనుంచి నిష్క్రమించాడు. 39 నిమిషాలపాటు సాగిన మ్యాచ్ ఆరంభం నుంచే చైనా ఆటాగాడు అరుదైన షాట్‌లతో భారత షట్లర్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో అభిమానులను నిరాశకు గురి చేస్తూ టోర్నమెంట్ నుండి పీవీ సింధు, ప్రణయ్‌లు వెనుతిరగక తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో నిరుటి విజేత కిడాంబి శ్రీకాంత్, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ తొలిరౌండ్‌లోనే టోర్నీనుంచి నిష్క్రమించటం తెలిసిందే.

బుమ్రా స్థానంలో శార్దుల్
న్యూఢిల్లీ, జూలై 6: ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో గాయాలపాలైన బుమ్రా స్థానంలో ముంబయి పాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది. శార్దూల్‌ను బుమ్రా స్థానంలోకి బీసీసీఐ ఎంపిక చేసింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఎడమచేతి బొటన వేలికి గాయమవడం తెలిసిందే. శస్త్ర చికిత్స కారణంగా బుమ్రా ఇంగ్లాండ్ వనే్డ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో శార్దుల్ టాకూర్‌కు టీమిండియా జట్టులో స్థానం దొరికింది.