క్రీడాభూమి

కుల్దీప్‌పై కనే్నశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూలై 7: ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తమ జట్టు ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లు సమర్థవంతంగా అడ్డుకున్నారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు టీ-20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను తన స్పిన్ మాయాజాలంతో హడలెత్తించి ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. అయితే, రెండో మ్యాచ్‌లో మాత్రం వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. కుల్దీప్‌కు ఇంగ్లాండ్ టూర్‌లో ఆడడం ఇదే తొలిసారి కావడంతో తొలి మ్యాచ్‌లో అతని బౌలింగ్ సామర్థ్యాన్ని సరిగా అంచనా వేయలేకపోయిన ఇయాన్ మోర్గాన్ సేన రెండో మ్యాచ్‌లో మాత్రం అతని బౌలింగ్‌ను సమర్థవంతంగా అడ్డుకుంది. ‘ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు బాగా ఆడారు. ముఖ్యంగా వారు కుల్దీప్ బౌలింగ్‌ను లక్ష్యం చేసుకుని తగిన విధంగా సన్నద్ధమై ఆడారు. ఫలితం సాధించారు’ అని కోహ్లీ అన్నాడు.