క్రీడాభూమి

పిచ్ కలిసొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూలై 7: టీమిండియాతో మాంచెస్టర్‌లో జరిగిన తొలి టీ-20లో తమ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసినా కార్డ్ఫిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆడిన పిచ్ (మైదానం) తమకు ఎంతో కలిసొచ్చిందని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. బంతి బౌన్స్ అయ్యే ఇక్కడి పిచ్ ద్వారా ప్రత్యర్థి జట్టు పరుగుల వరద పారించకుండా కేవలం 148కే తాము కట్టడి చేయగలిగామని, తద్వారా 1-1తో సిరీస్‌ను సమం చేశామని అన్నాడు. ‘మాంచెస్టర్ పిచ్‌లో భారత యువస్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించి వికెట్లు పడగొట్టాడు. అతను చాలా గొప్ప బౌలర్. కానీ కార్డ్ఫి పిచ్ అందుకు భిన్నంగా ఉంటుంది. అతని బౌలింగ్ సరళిని మొదటి మ్యాచ్‌లోనే గ్రహించాం. కనుకనే రెండో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నాం’ అని ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. రెండో మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా గట్టి ప్రణాళికతో బరిలోకి దిగామని, అందుకు తగ్గట్టుగా తమ ఆటగాళ్లు ఆడారని, తద్వారా విజయం సాధించామన్నాడు.