క్రీడాభూమి

స్పిన్ ద్వయానికి సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టోల్, జూలై 7: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగే టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. టీమిండియా తన 70 రోజుల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ఘన విజయాన్ని నమోదు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్‌తోపాటు మూడో టీ-20లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటామని కలలుగన్న కోహ్లీ ఆశలపై ప్రత్యర్థి టీమ్ నీళ్లు చల్లింది. రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఐదు వికెట్లు తేడాతో గెలుపొందడం ద్వారా మూడు టీ-20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆదివారం జరిగే మూడో మ్యాచ్ భారత స్పిన్నర్ల ద్వయానికి ఏడాది తర్వాత ఒకవిధంగా సవాల్ లాంటిదే. కార్డ్ఫిలో తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన భారత ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ సహా యుజువేంద్ర చాహల్ రెండో మ్యాచ్‌లో మాత్రం వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. టీమిండియాలో గాయపడిన మరో స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనపడింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీసినా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో అలెక్స్ హేల్స్ 41 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి (నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) జట్టును గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాలపై మోశాడు. గాయపడిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌లో ఆడనున్నందున టీమిండియాకు గట్టి పోటీ తప్పదని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, టీమిండియా ఆడిన తొలి టీ-20లో రాణించిన సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రెండో మ్యాచ్‌లో పరుగుల వరద పారించలేకపోయినా ఆఖరి మ్యాచ్‌లో విజృంభిస్తారనే నమ్మకాన్ని జట్టు గట్టి నమ్మకంతో ఉంది. మనీష్ పాండే, సిద్దార్ధ కౌల్, కృణాల్ పాండ్య, దీపక్ చాహర్ వంటివారు అవకాశాల కోసం అర్రులు చాస్తున్నారు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా మళ్లీ మరోసారి బ్యాట్‌ను ఝలిపిస్తే టీ-20 సిరీస్ చేజిక్కించుకోచ్చు.