క్రీడాభూమి

నీటి కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఏప్రిల్ 21: మహారాష్టల్రో స్థాయిలో కాకపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపిఎల్ మ్యాచ్‌లకు లక్షల లీటర్ల వాడకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మే ఒకటో తేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిందిగా బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో, అక్కడ మ్యాచ్‌లు ఆడాల్సిన ఫ్రాంచైజీలు ప్రత్యామ్నాయ వేదికలను ఎంచుకున్నాయి. పుణెలోని హోం గ్రౌండ్‌లో ఆడాల్సిన మూడు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడేందుకు రైజింగ్ పుణె సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఎసిఎ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, మ్యాచ్‌ల కోసం మైదానాన్ని క్యూరింగ్ చేసేందుకు ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వబోమని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. మహారాష్టల్రో ఎదురైన సమస్యే ఆంధ్ర ప్రదేశ్‌లోనూ తమను వెంటాడే ప్రమాదం ఉందని రైజింగ్ పుణె ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు ఎసిఎ అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఒక్కో ఐపిఎల్ మ్యాచ్‌కి సుమారు మూడు లక్షల లీటర్లు అవసరమవుతాయని అంచనా. ఒకవైపు నీటి ఎద్దడి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంటే, మరోవైపు ఐపిఎల్ మ్యాచ్‌ల పేరుతో లక్షలాది లీటర్ల నీటిని వృథా చేయడం ఎంత వరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. రాజధాని హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్. అక్కడ మ్యాచ్‌లు జరగడంతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమైంది. చుక్క నీటి కోసం తాము పడరాని పాట్లు పడుతుంటే, ఐపిఎల్ మ్యాచ్‌లకు నీటి వాడకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు.