క్రీడాభూమి

ఎక్కడ తగ్గాలో తెలిసినోడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ్ని నోవ్‌గొరోడ్, జూలై 7: ప్రపంచకప్ పోరులో ఫ్రాన్స్‌ను సెమీస్‌కు తీసుకెళ్లే అనితరసాధ్యమైన గోల్ సాధించిన ఆంటోనీ గ్రీజ్‌మన్ ఎందుకు కామ్‌గా ఉండిపోయాడో తెలుసా? గోల్ సాధించిన ఆనందంకంటే ప్రత్యర్థి జట్టుపైనున్న గౌరవమే గ్రీజ్‌మన్‌ను కామ్‌గా ఉండిపోయేలే చేసింది. జట్టు మొత్తం సంబరాలు చేసుకుంటున్నా గ్రీజ్‌మన్ వౌనానే్న ఆశ్రయించాడు. ఎందుకంటే, ప్రత్యర్థి జట్టు ఉరుగ్వేయన్లపై అతినికి అపారమైన గౌరవం.
‘నిజ్ని నోవ్‌గొరోడ్ మైదానంలో ఉరుగ్వేపై సాధించిన గోల్‌ను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. దక్షిణ అమెరికా దేశాల్లో ఉరుగ్వేపై నాకు అపారమైన గౌరవముంది’ అంటూ గ్రీజ్‌మన్ వ్యాఖ్యానించాడు. ఉరుగ్వే -ఫ్రాన్స్ మ్యాచ్‌లో 61వ నిమిషంలో రెండో గోల్‌ను అందించి తన జట్టును సెమీస్‌కు తీసుకెళ్లింది గ్రీజ్‌మనే. ఆ గోల్‌తో పనె్నండేళ్ల తరువాత ఫ్రాన్స్ సెమీస్‌కు వెళ్లిన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, పొరబాటు చేసిన ఉరుగ్వే గోల్ కీపర్ ఫెర్నాన్డో ముస్లెరావైపే గ్రీజ్‌మన్ చూస్తూండిపోయాడు. ‘ఆ గోల్ నాకు ఆనందమే అయినా వ్యక్తం చేయలేపోయాను. ఎందుకంటే ఉరుగ్వేయన్ల సహకారంతోనే ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా వచ్చాను. ఆటగాడిగా నాలో మంచి చెడ్డలన్నీ వాళ్ల పుణ్యమే. అందుకే వాళ్లపై అపారమైన గౌరవం. గోల్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు’ అంటూ తన ఉదాత్తత చాటుకున్నాడు గ్రీజ్‌మన్. మ్యాచ్ పూరె్తైన తరువాత ఉరుగ్వే జట్టులోని అత్యంత సన్నిహితులు జోస్ గిమినెజ్, డైగో గోడిన్‌తో చాలాసేపు మాట్లాడిన తరువాతే గ్రీజ్‌మన్ మైదానం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది.