క్రీడాభూమి

భళి భళి.. బెల్జియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజన్ అరెనా, జూలై 7: సత్తా చూపుతాయనుకున్న ఫేవరేట్ జట్లన్నీ సైలెంట్‌గా ఇంటిముఖం పట్టేశాయి. ఫిఫా ప్రపంచకప్‌కు ముందు టైటిల్ ఫేవరేట్లు, అండర్ డాగ్‌లు, డిఫెండింగ్ చాంపియన్లు.. అంటూ భారీ టాగ్‌లతో వచ్చిన చాలా జట్లు సెమీస్‌కు ముందే నిష్క్రమించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆతిథ్య దేశం రష్యా సహా పసికూనలు కసిని ప్రదర్శిస్తూ ఫిఫా కప్ కోసం పరుగులు పెడుతున్నాయి. పెద్ద జట్లుగా బరిలోకి దిగి ఇంటిదారి పట్టిన జర్మనీ, అర్జెంటీనా, పోర్చుగల్, స్పెయిన్, ఉరుగ్వే, కొలంబియా మాదిరిగానే బ్రెజిల్ సైతం ఫిఫా నుంచి ఘోర పరాభవంతో నిష్క్రమించింది. వీర పరాక్రమాన్ని ప్రదర్శించిన బెల్జియం 2-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుని సెమీస్‌లో ఫ్రాన్స్‌తో పోరాడేందుకు సిద్ధమైంది. కజన అరెనాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన బ్రెజిల్ -బెల్జియం పోరులో బెల్జియందే పైచేయి అయ్యింది. బ్రెజిల్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టిన బెల్జియం జట్టు, అనూహ్యంగా విజయం సాధించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే బెల్జియంను ప్రత్యర్థి జట్టు బ్రెజిలే గెలిపించింది కూడా. బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ ఫెర్నాన్డినో ఓన్ గోల్‌తో బెల్జియంకు బోణీనిస్తే, పావుగంట ఆట దాటకుండానే కెవిన్ డే బ్రెయినే మరో గోల్ సాధించి బెల్జియంను 2-0 ఆధిక్యానికి తీసుకెళ్లాడు. ప్రత్యర్థి జట్టు రెండు గోల్స్ సాధించిన ఏ మ్యాచ్‌లోనూ బ్రెజిల్ నెగ్గలేదన్న (1938లో స్వీడన్ మీద తప్ప) సెంటిమెంట్‌నే ఖరారు చేస్తూ చివరి వరకూ పోరాడిన బ్రెజిల్ 1-2తో ఓటమి చవిచూసింది. హోరాహోరీగా మొదలైన మ్యాచ్‌లో 13వ నిమిషంలోనే ఓన్ గోల్‌తో బెల్జియంకు ఆధిక్యాన్నిచ్చిన బ్రెజిల్, ఆ తరువాత ఏమాత్రం బెల్జియంను ఎదుర్కోలేకపోయింది. 31వ నిమిషంలో లుకాకు అందించిన పాస్‌ను అద్భుత గోల్‌గా మలిచి కెవిన్ డే బ్రయిన్ తన జట్టును 2-0లో కూర్చోబెట్టాడు. ప్రథమ భాగం ముగిసినా బ్రెజిల్‌కు గోల్ పడకపోవడంతో జట్టు తీవ్ర వత్తిడికి గురైంది. మాయా నైపుణ్యంతో బ్రెజిల్‌ను ఒడ్డుకు చేరుస్తాడనుకున్న స్టార్ స్ట్రయికర్ నేమార్ పూర్తిగా విఫలమయ్యాడు. ద్వితీయ భాగంలోనూ దుర్భేద్యమైన రక్షణ వలయంతో బ్రెజిల్‌ను బెల్జియం పూర్తిగా నియంత్రించింది. బంతి బ్రెజిల్ నియంత్రణలోనే ఎక్కువసేపున్నా, గోల్స్ పడకుండా బెల్జియం గట్టిగా అడ్డుకోగలిగింది. చివరి అంకంలో సబ్‌స్టిట్యూట్‌గా దిగిన బ్రెజిల్ ఆటగాడు, దిగిన మూడు నిమిషాల్లోనే (76వ నిమిషంలో) గోల్ సాధించడంతో మళ్లీ బ్రెజిల్‌లో ఉత్సాహం కనిపించింది. బెల్జియం సమర్థమైన ఆటతీరు ప్రదర్శించడంతో బ్రెజిల్ ఆట సాగలేదు. ఇంజ్యురీ టైంలోనూ ఎలాంటి గోల్స్ సాధించలేక బెల్జియం ముందు తలొంచింది. ప్రపంచ కప్ పోరాటంలో ఈ విజయంతో బెల్జియం రెండోసారి సెమీస్‌కు చేరిన రికార్డును నమోదు చేసుకుంది. అంతేకాదు, బ్రెజిల్‌మీద బెల్జియంకు ఇది రెండో విజయం. ఉరుగ్వేపై విజయంతో సెమీస్‌కు చేరుకున్న ఫ్రాన్స్‌తో బెల్జియం 10న మంగళవారం సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియంలో తలపడనుంది.