క్రీడాభూమి

‘స్వర్ణ’దీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: టర్కీలోని మెర్సిన్‌లో జరిగిన ఎఫ్‌ఐజీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో భారత క్రీడాకారిణి దీపా కర్మాకర్ స్వర్ణ పతకం సాధించింది. తొలి ప్రయత్నంలో ఆమె అతికష్టంగా 14.100 పాయింట్లు సాధించినా రెండో ప్రయత్నంలో 14.200 (5.600 +8.600) పాయింట్లతో సరాసరిన 14.150తో విజయం సాధించింది. దీపా కర్మాకర్‌తో పోటీపడిన ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందిన రిఫ్‌డా ఎల్ఫ్రానాలుథిఫి 13.400 పాయింట్లతో రజత పతకం, స్థానిక అథ్లెట్ గోక్సు ఉక్టాస్ సాన్లీ కాంస్య పతకం సాధించారు. త్రిపురకు చెందిన 24 ఏళ్ల దీపా కర్మాకర్ 2016 రియో ఒలింపిక్స్ వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో ఆమె 14.150 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గాయాల కారణంగా ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్ సహా పలు పోటీలకు ఆమె దూరంగా ఉంది. శస్తచ్రికిత్స, విశ్రాంతి అనంతరం వరల్డ్ చాలెంజ్ కప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఇదే ప్రథమం. త్వరలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే పది మంది సభ్యులు కలిగిన భారత జిమ్నాస్ట్ జట్టులో ఆమె సభ్యురాలిగా ఎంపికవ్వడం తెలిసిందే.