క్రీడాభూమి

క్రొయేషియా కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి (రష్యా), జూలై 8: ఆతిథ్య దేశమన్న ఓకే ఒక్క టాగ్‌లైన్ తప్ప ఎలాంటి అంచనాలు లేని జట్టు. సంచలనాల ఫిఫాలో అంచనాలకు అందని స్థాయికి వచ్చింది. ప్రపంచకప్‌నే ముద్దాడగలదన్న నమ్మకాన్ని కలిగించింది. దేశం మొత్తం దన్నుగా నిలవడంతో తమకు తిరుగులేదన్న ఉత్సాహానే్న ప్రదర్శించింది. ఇవన్నీ ఒక్క మ్యాచ్‌తో తలకిందులవడంతో, విచార వదనంతో రష్యా ప్రపంచకప్ పోరు నుంచి నిష్క్రమించింది. సెమీస్‌కు చేరాలనుకున్న రష్యా ఆశలను క్రొయేషియా ఆటగాడు ఇవాన్ రాకిటిక్ తలకిందులు చేశాడు. ‘అదృష్టం వాళ్లనే వరించింది’ అంటూ కోచ్ స్టానిస్లావ్ చెర్చిసోవ్ రష్యా జట్టును తీసుకుని మైదానం నుంచి నిష్క్రమించాడు. సోచిలో శనివారం అర్థరాత్రి జరిగిన రష్యా-క్రొయేషియా క్వార్టర్ ఫైనల్స్ పోరులో క్రొయేషియా విజయం సాధించి సెమీస్‌కు చేరింది. నాటకీయ ఆట పరిణామాల మధ్య రెండు జట్లూ సమాన స్థాయిని ప్రదర్శించడంతో, పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఏ షూటౌట్‌తో స్పెయిన్‌లాంటి దిగ్గజ జట్టును ప్రపంచకప్ నుంచి ఇంటికి పంపిందో, అదే షూటౌట్‌తో ఇప్పుడు రష్యా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. నిజానికి 115వ నిమిషంలో మారియో ఫెర్నాండెజ్ హెడర్ గోల్‌తో స్కోర్లు సమం చేసి రష్యా జట్టులో ఆశలు చిగురింపచేశాడు. ఉత్సాహంగా షూటౌట్‌కు సిద్ధపడిన రష్యా, చివరికి అక్కడే చతికిలపడింది. ఫెర్నాండెజ్, ఫెడోర్ స్మొలోవ్‌లు స్పాట్ కిక్కులను గోల్ చేయడంలో విఫలమైతే, క్రొయేషియా ఆటగాళ్లు ఆండ్రెజ్ క్రమారిక్, డొమగోజ్ విదాలు తమ అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని జట్టును సెమీస్‌కు తీసుకెళ్లారు. 1998 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్న క్రొయేషియా, ఇప్పుడు మళ్లీ సెమీస్‌లో స్థానం పదిలపర్చుకుంది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో బుధవారం ఇంగ్లాండ్‌తో తలపడబోతోంది. సెమీస్‌లో స్థానం కోసం ఉత్సాహంతో మైదానంలోకి దిగిన రష్యా, మ్యాచ్ ఫస్టాప్‌లో క్రొయేషియాకు గట్టిపోటీనే ఇచ్చింది. బంతిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుని ఆడిన రష్యా, ప్రథమార్థంలోనే (31వ నిమిషంలో) డెనిస్ చెరిషెవ్ సాధించిన అద్భుత గోల్‌తో 1-0 ఆధిక్యానికి చేరుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీకి వచ్చిన రష్యా, క్వార్టర్స్‌కు చేరుకుని తొలి గోల్ సాధించడంతో జట్టులో అమితోత్సాహం కనిపించింది. అయితే, ఆ ఉత్సాహం ఎంతోసేపు కనిపించలేదు. 39వ నిమిషంలో క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ ఆండ్రెజ్ క్రమారిక్ గోల్ సాధించడంతో స్కోర్ సమమైంది. ద్వితీయార్థం ఆట ముగిసేవరకూ రెండు జట్లకూ గోల్ దక్కలేదు. అదనపు సమయంలో డిఫెండర్ డొమాగోజ్ విదా గోల్ సాధించి క్రొయేషియాను 2-1 ఆధిక్యానికి తీసుకెళ్తే, 115వ నిమిషంలో రష్యా డిఫెండర్ మారియో ఫెర్నాండెజ్ గోల్ సాధించి క్రొయేషియా స్కోర్‌తో సమం చేశాడు. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. షూటౌట్‌లో రష్యా మూడు గోల్స్, క్రొయేషియా నాలుగు గోల్స్ సాధించడంతో 4-3 ఆధిక్యంతో మ్యాచ్‌లో క్రొయేషియా విజయం సాధించింది. తమ దేశం జట్టు ఓటమితో రష్యన్లు కన్నీటిపర్యంతమయ్యారు.

చిత్రం..తమ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ స్టాండ్స్‌లో కేరింతలు కొడుతున్న క్రొయేషియా అధ్యక్షురాలు
కొలిండా గ్రాబర్ కిటారోవిక్