క్రీడాభూమి

రెడ్ డెవిల్సా.. లెస్ బ్లూసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 9: హోరాహోరీ పోరు తప్పదన్న భారీ అంచనాల మధ్య లెస్ బ్లూస్ (ఫ్రాన్స్), రెడ్ డెవిల్స్ (బెల్జియం) జట్లు మంగళవారం ఫిఫా సాకర్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. జట్టుకున్న పేరు ప్రఖ్యాతులు, గత చరిత్ర పరిగణనలోకి తీసుకుంటే బెల్జియంపై ఫ్రాన్స్‌దే పైచేయిగా చెప్పుకోవాలి. అయితే టోర్నీ ఆరంభం నుంచీ బెల్జియం అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తోంది. దీంతో మంగళవారం నాటి ఫలితంపై ఉత్కంఠ రేకెత్తుతుంది? ఎవరు విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరతారో అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో చివరిసారి 1986లో ఢీకొన్నాయి. మూడోస్థానం కోసం జరిగిన అప్పటి పోరులో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించింది. అప్పటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెల్జియం, ఈసారి తుది వరకూ పోరాటం కొనసాగించడం ఖాయం. ఫ్రాన్స్ కూడా గత మ్యాచ్‌ల నుంచి నేర్చుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, మితిమీరిన డిఫెన్స్‌కు వెళ్లకుండా అటాకింగ్ గేమ్‌కు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదు. మొత్తంమీద ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించేందుకు సిద్ధంగా ఉండటంతో, మంగళవారం నాటి సెమీ ఫైనల్ ఆసక్తి రేపుతోంది. ఫలితం ఎలావున్నా అభిమానులకు ఒక అద్భుతమైన మ్యాచ్‌ని చూసే అవకాశం లభిస్తుంది. ఈసారి వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఫ్రాన్స్ రెండు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. ‘బీ’ గ్రూప్‌లో ఉన్న ఈ జట్టు తొలి మ్యాచ్‌లో రష్యాను 2-1 తేడాతో ఓడించింది. తర్వాత పెరూపై 1-0 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొదటి మ్యాచ్‌లో కొంత దూకుడుగా ఆడిన ఫ్రాన్స్ రెండో మ్యాచ్‌లో రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. అతి కష్టం మీద ఒక గోల్‌తో విజయాన్ని నమోదు చేసినప్పటికీ, వ్యూహరచనలోని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఇక చివరిదైన మూడో గ్రూప్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ తన ఆటతీరును మార్చుకుంటుందని అభిమానులు ఊహించారు. కానీ, అందుకు భిన్నంగా మరోసారి మితిమీరిన డిఫెన్స్‌తో అందరినీ నిరాశపర్చింది. డెన్మార్క్‌కు గట్టిపోటీ ఇవ్వలేక మ్యాచ్ డ్రా చేసుకుంది. ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. డెన్మార్క్‌తో మ్యాచ్ ఫ్రాన్స్‌ను పునరాలోచనలో పడేసింది. అందుకే ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ మ్యాచ్‌ల్లో దాడులకు ఉపక్రమించింది. ‘లాస్ట్-16’ దశలో పటిష్టమైన అర్జెంటీనాతో తలపడి 4-3 తేడాతో విజయం సాధించింది. అదే ఉత్సాహంతో క్వార్టర్ ఫైనల్‌లో ఉరుగ్వేపై 2-0 ఆధిక్యంతో గెలిచింది. అటాకింగ్‌తోనే సానుకూల ఫలితాలు సాధ్యమని స్పష్టం కావడంతో ఫ్రాన్స్ మంగళవారంనాటి మ్యాచ్‌లో బెల్జియంతోనూ ఇదే విధానాన్ని అనుసరించి, అమీతుమీ తేల్చుకునే ప్రయత్నం చేయనుంది. అభిమానులు కూడా అలాంటి పోరాటానే్న కోరుకుంటున్నారు.
బెల్జియం విషయానికి వస్తే, టైటిల్ ఫేవరిట్ బ్రెజిల్‌ను క్వార్టర్ ఫైనల్‌లో ఓడించి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గ్రూప్ ‘జీ’లో పోటీపడి, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించడం విశేషం. పనామా, ట్యునీషియాలపై విజయాలతో తనకు తిరుగులేదని నిరూపించిన ఈ జట్టు ప్రీ క్వార్టర్స్‌లో ‘జెయింట్ కిల్లర్’ జపాన్‌పై 3-2 స్కోరుతో విజయాన్ని నమోదు చేసింది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియం పోరాటానికి అభిమానులు జేజేలు పలికారు. అత్యంత బలమైన బ్రెజిల్‌ను ఇంటిదారి పట్టించటం ఒక అద్భుతమే. అదే స్థాయిలో ఆడితే మంగళవారం నాటి మ్యాచ్‌లో బెల్జియం నుంచి ఫ్రాన్స్‌కు తీవ్రమైన పోటీ తప్పదు.