క్రీడాభూమి

మేరా ఇంగ్లాండ్ మహాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 10: ఉత్తర ఇంగ్లాండ్ షెఫీల్డ్ ఇళ్లపై ఇంగ్లాండ్ జాతీయ జెండాలు వందలాదిగా రెపరెపలాడుతున్నాయ. క్రొయేషియాను ఎదుర్కోబోతున్న ఇంగ్లాండ్ జట్టులోని కిలె వాకర్, హ్యారీ మాగురీ, జామి వర్డీలు పుట్టిపెరిగింది ఇక్కడే. అందుకే ఇంగ్లాండ్ విజయం కోసం తహతహలాడుతూ అభిమానులు ఇలా ఇళ్లపై జెండాలను ఆవిష్కరింపచేశారు. అవునుమరి, లండన్‌వాసులు ఒక్క విజయం కోసం తహతహలాడుతున్నారు. సెమీస్ ఉత్కంఠ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. స్వీడన్‌పై విజయంతో జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్ గెరెత్ సౌత్‌గేట్‌ను హీరోగా ప్రశంసిస్తున్నారు. అంతకుమించి జూలై 11 బుధవారం రాత్రి ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదని స్వచ్ఛందంగా తీర్మానించుకున్నారు. ఆ రోజు రష్యాలోని లుజ్నికి స్టేడియంలో క్రొయేషియాతో ఇంగ్లాండ్ తలపడబోతోంది. విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఇప్పటికే పనె్నండేళ్ల కలను సాకారం చేసుకుని సెమీస్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్, 28ఏళ్ల క్రితంనాటి సత్తా ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది. ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న జాతీయ జట్టు కృషికి ప్రేరణగా నిలిచేందుకు లండనీయులు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘కల నెరవేరబోతోంది’ అంటూ పత్రికలు పతాక శీర్షికలు రాస్తుంటే, ‘వీడూ కథానాయకుడు’ అంటూ గోల్‌కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్‌ను చానెల్స్ ఇప్పిటికే ఆకాశానికి ఎత్తేసాయ. స్వీడన్‌పై ఇంగ్లాండ్ విజయాన్ని 32 మిలియన్ల మంది టీవీల్లో చూసినట్టు పత్రికలు కథనాలు రాసుకొచ్చాయి. 1990లో ఇంగ్లాండ్ జట్టును ఫైనల్‌కు తీసుకొచ్చిన అప్పటి కోచ్ బాబీ రాబ్‌సన్‌తో గెరెత్ సౌత్‌గేట్‌ను పోలుస్తూ, ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరడం ఖాయమన్న ఆనందాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.