క్రీడాభూమి

నెంబర్ ఫోరే బెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెరుల్లా నొట్టింగమ్, జూలై 10: ఇంగ్లాండ్‌తో జరగనున్న వనే్డ సీరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండాలంటే, జట్టు సారథి విరాట్ కోహ్లీ ఫోర్త్ ప్లేయర్‌గా దిగాలని మాజీ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ సలహా ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి కోహ్లీ ఫోర్త్ ప్లేస్‌లో దిగడమే కారణమన్నాడు. 2017 జూలై- ఆగస్టుల్లో శ్రీలంక టూర్ మొదలైన దగ్గర్నుంచీ టీమిండియా ప్రయోగాలు చేస్తోంది. ఫోర్త్ ప్లేయర్‌గా ఆరుగురు బ్యాట్స్‌మన్లను (కెఎల రాహుల్, కెదార్ జాదవ్, మనీష్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అజింక్యా రహానే) దింపింది. కానీ, ఆ ప్లేస్‌లో విరాట్ ఆడటం ఒక్కటే సరైన వ్యూహమని గంగూలీ అంటున్నాడు. ‘మొన్ననే ఆడిన టీ-20 సిరీస్ బ్యాటింగ్ లైనప్ చూడండి. ఎంత చక్కగా, పటిష్టంగా ఉందో. రాహుల్ థర్డ్ ప్లేయర్‌గా, కోహ్లీ ఫోర్త్ ప్లేయర్‌గా చక్కగా రాణించారు. బ్యాట్స్‌మన్ లైనప్‌లో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తలేదు. అందుకే, వనే్డలకు సైతం అదే వ్యూహాన్ని అనుసరిస్తే మంచి ఫలితం అందవచ్చని బలంగా నమ్ముతున్నా’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.