క్రీడాభూమి

సెమీస్‌లో సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 10: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సెంటర్ కోర్టు, సెంటర్ కోర్టు-1లలో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సహా నలుగురు విజయం సాధించారు. సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి కామిలా జియోర్జీ ఆడిన తొలి రౌండ్‌లో (3-6) నిరాశపరిచినా, రెండు, మూడు రౌండ్లలో (6-3, 6-4) విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జె.జార్జెస్ తన ప్రత్యర్థి కె.బెర్టెన్‌ను 6-3, 7-5, 6-1 తేడాతో ఓడించింది. ఇంకో మ్యాచ్‌లో ఆంజిలిక్ కెర్బర్ 6-3, 5-7 తేడాతో తన సమీప ప్రత్యర్థి డారియా కస్టాకినాను ఓడించింది. మరో మ్యాచ్‌లో లాటిన్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకో తన సమీప ప్రత్యర్థి డొమినికా సిబుల్‌కోవాపై 7-5, 6-4పై గెలుపొందింది. ఆయా విభాగాల్లో గెలుపొందడం ద్వారా నలుగురు క్రీడాకారిణులు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.
కిరీటం సెరెనాదే..
లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్ నుంచి నాలుగు రౌండ్ల వరకు ప్రత్యర్థి ఎలాంటి వారైనా అప్రతిహతంగా దూసుకుపోతున్న అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ట్రోఫీని తప్పనిసరిగా గెల్చుకుంటానన్న గట్టి నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడిన సెరెనా ఎనిమిదోసారి సాధించే దిశగా పోరాడుతోంది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో ఆమె తన ప్రత్యర్థి ఎవ్‌జెనియా రొడీనాను 6-2, 6-2తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. వింబుల్డన్‌లో క్వార్టర్స్ ఫైనల్‌లోకి అడుగుపెట్టడం సెరెనాకు ఇది 13వసారి. క్వార్టర్స్ ఫైనల్‌లో ఆమె ఇటాలియన్ వరల్డ్ నెంబర్ 52 కమీలా జియోర్గీతో సెమీఫైనల్స్‌లో పోరు కోసం తలపడనుంది. 36 ఏళ్ల వయసులో వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో ఆడిన ఏ మహిళా స్టార్ కూడా ఎనిమిదోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేదు. ఈ ఘనత ఇపుడు సెరెనాకు దక్కింది. టెన్నిస్ దిగ్గజాలుగా పేరుగాంచిన వారిలో గార్బినె ముగురుజా, మారియా షరపోవా, సిమోనా హలెప్, పెట్రా క్విటోవా, వీనస్ విలియమ్స్, కరోలినా వొజియాంకి, స్లొయేన్ స్టీఫెన్స్ వంటివారు వింబుల్డన్ తొలి నాలుగు రౌండ్లలోనే పరాజయం పాలవడం ఇపుడు సెరెనాకు కలసివచ్చే అవకాశం ఉంది. పలు మ్యాచ్‌లలో ఎన్నోసార్లు ఓటమిపాలైనా వెరవని సెరెనా వింబుల్డన్ నిర్వాహకులు తనను 25వ సీడ్‌గా గుర్తించడంతో ఆమెలో మరింత కసిని పెంచింది. ‘నా జీవితంలో ఎంతోమంది టాప్ సీడెడ్ క్రీడాకారిణులతో తలపడ్డా. ఇపుడు నేను హ్యాపీగా ఉన్నాను’ అని సెరెనా పేర్కొంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని, అన్నింటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడితేనే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చునని తాము నమ్ముతానని ఆమె పేర్కొంది. ‘టాప్ ర్యాంక్ సాధించినపుడు పొంగిపోలేదు. ర్యాంక్ తగ్గినపుడు కృంగిపోలేదు. ఇప్పటికీ ఆడిన ప్రతి టోర్నమెంట్‌లోనూ విజయం సాధించేందుకు తుదివరకు పోరాడుతుంటా’ అని ఆమె తెలిపింది. గత ఏడాది గర్భంతో ఉండడంతో వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆడలేకపోయిన తాను ఇపుడు ఆటతీరును మరింత మెరుగుపరచుకున్నానని ఆమె పేర్కొంది. ఇప్పటికే నాలుగు రౌండ్లలో పోటీపడి నెగ్గిన తాను మిగిలిన మ్యాచ్‌లలో కూడా ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తాననే, ఈ విషయంలో తాను ఎలాంటి ఒత్తిడికి గురికావడంలేదని ఆమె తెలిపింది. ప్రత్యర్థి ఎలాంటివారైనా తాను ఆలోచించనని, సహజమైన ఆటతీరుతో ఉత్తమంగా రాణించాలనే కోరుకుంటానని ఆమె పేర్కొంది.