క్రీడాభూమి

ఎవరో.. ఫైనల్ హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెపినో: సెమీస్ ఉత్కంఠ క్షణాల కోసం లండన్‌వాసులు లక్ష కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ పోరులో 28 ఏళ్ల క్రితంనాటి అద్భుత క్షణాలు అందిపుచ్చుకోడానికి జాతీయ జట్టు సైతం ఉర్రూతలూగుతోంది. సాకర్ పోరులో 28 ఏళ్ల తరువాత సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్, ప్రత్యర్థి జట్టు క్రొయేషియాను కేక పెట్టించేందుకు వ్యూహాలు పన్నుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు, అండర్‌డాగ్ గేమ్‌తో క్రేజ్ తెచ్చుకుంది. మ్యాచ్‌లు చూడ్డానికి లక్షలాది దేశాభిమానులు టెలివిజన్ సెట్లముందు అతుక్కుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. క్వార్టర్ ఫైనల్స్‌లో జట్టు సాధించిన విజయానికి పెద్ద వేడుకలే జరిగాయి. సమర్థ కోచ్‌గా గెరెత్ సౌత్‌గేట్, అతని జట్టులోని ఆటగాళ్లను హీరోల్లా చూస్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఇలాంటి వాతావరణం కనిపిస్తుంటే, రెపినోకు 45 కిలోమీటర్ల దూరంలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియం దగ్గర భిన్నమైన వాతావరణం కనిపించింది. డెలె అల్లి సారథ్యంలోని జట్టు ఆటగాళ్లంతా రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నారు. ‘మేం ఇక్కడ ఎలా ఉండాలో అలానే ఉన్నాం. పదునైన సాధనపై దృష్టిపెట్టాం. ఇదెంత బరువైన బాధ్యతో మాకు తెలుసు’ అని డెలె అల్లి వ్యాఖ్యానించాడు. ‘ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఆడబోతున్నామన్న స్పృహతో ఉన్నాం. మా ఏకాగ్రత గేమ్‌పైనే. ఇప్పటి వరకూ ఏం సాధించామన్నది కాదు, ఇప్పుడు సాధించబోయేదే కీలకం. అందుకు మేం ఇంత కూల్‌గా ఉండటమే కరెక్ట్. అంతా ఆశాజనకమే. ప్రత్యేక విజయంతో ఫైనల్‌కు వెళ్తాం. అక్కడా గెలుపు మాదే’ అంటూ అల్లి ధీమా వ్యక్తం చేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో స్వీడన్ మీద 2-0తో విజయం సాధించిన ఇంగ్లాండ్, క్రొయేషియానూ ఖంగుతినిపించాలన్న కసితో కనిపిస్తోంది. అయితే, క్రొయేషియాను అంత తక్కువ అంచనా వేయలేమన్న స్పృహ జట్టులో లేకపోలేదు. అర్జెంటీనాలాంటి దగ్గజ జట్టును అలవోకగా ఇంటికి పంపేసిన విజయగర్వంతో క్రొయేషియా పటిష్టంగా ఉంది. క్రొయేషియా మీడ్‌ఫీల్డ్ ఆటగాళ్లు లుకా మోడ్రిక్, ఇవాన్ రాకిటిక్‌లు ఫాంలో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే విషయం. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ఫలితాలను బట్టి క్రొయేషియాకు విజయావకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పలేమన్నది ఫుట్‌బాల్ పండితులు, నిపుణులు మాట. అయితే, అల్లీ జట్టు మాత్రం కూల్‌గా కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ప్రత్యర్థి బలాబలాలకు భయపడే సమయం కాదిది. మా జట్టేంటో బాగా తెలుసు. ప్రత్యర్థి ఎవ్వరైనా పోరాడటమే తప్ప, మరో విషయాన్ని ఆలోచించం’ అంటున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ అల్లీ. ‘నమ్మశక్యంకాని అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో కొందరున్నారు. వ్యూహాత్మకంగా జట్టును నడిపించే నాయకుడూ ఉన్నాడు. అన్ని విషయాల్లో స్పష్టంగా ఉన్నాం. ఇంతకంటే జట్టుకు ఏంకావాలి?’. ఇదీ అల్లి భరోసా. బలమైన పునాధి ఉంది. మాకేం కావాలన్న అంశంపై స్పష్టత ఉంది. సాధించగలమన్న అంశంపై నమ్మకమూ ఉంది. సో, ఇంగ్లాండ్ విజయం సాధించడంలో అతిశయోక్తి ఏమీ ఉండదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టు ఇంత నిబ్బరంగా ఉంటే, ప్రత్యర్థి క్రొయేషియా జట్టులో భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రష్యాపై విజయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన క్రొయేషియా డెలిగేట్, అంతర్జాతీయ మాజీ ఆటగాడు ఓగ్నెజెన్ వుకోజెవివ్ వివాదాల్లో కూరుకోవడం క్రొయేషియా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేదే. రష్యాపై క్రొయేషియా సాధించిన పెనాల్టీ షూటౌట్ వీడియోను ఉక్రెయిన్‌ను అనుకూలమైన వ్యాఖ్యానంతో పోస్ట్ చేసినందుకు ఫిఫా నిర్వాహకులు సీరియస్ అయ్యారు. ఫైన్ విధించడంతోపాటు డెలిగేషన్ రద్దుచేసి పంపేయడంతో క్రొయేషియా ఒకింత పరాభవాన్ని మోస్తున్నట్టే. అంతేకాదు, డిఫెండర్ దమాగోజ్ విదా కూడా వివాదాస్పద వైఖరితో ఫిఫా ఆగ్రహానికి గురై, చివరిక్షణాల్లో చివాట్లతో బయటపడ్డాడు. ఏసీ మిలాన్, స్ట్రయికర్ నికోలా కలినిక్‌లు సైతం మ్యాచ్‌లో ఉండారో లేదో డౌటే. వాళ్ల ఫిట్‌నెస్ విషయంలో కోచ్ జ్లాక్కో డాలిక్‌కు సందేహాలు తలెత్తడంతో పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ మైనస్ పాయింట్లను కాసేపు పక్కనపెడితే మాత్రం క్రొయేషియా జట్టు మంచి ఫాంలో ఉంది. 20 ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లో చూపించిన అద్భుత ఆట ప్రావీణ్యాన్ని ప్రస్తుత జట్టు సైతం ప్రదర్శిస్తోంది. మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మాడ్రిక్ ఒకవైపు, డెన్మార్క్, రష్యాలపై రెండు షూటౌట్ విజయాలతో రాకిటిక్ మరోవైపు జట్టుకు పెద్ద అండగా కనిపిస్తున్నారు. ‘సెమీస్‌లో బలాన్నంతా సమీకరించుకుంటున్నాం, ఇంగ్లాండ్‌పై విజయం సాధించడానికి. జరగబోయే యుద్ధంలో మాదే గెలుపు’ అంటున్నాడు క్రొయేషియా కోచ్ డాలిక్.

చిత్రాలు..మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో ప్రపంచ సాకర్ అభిమానులకు హీరో అయపోయన క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ లుకా మాడ్రిక్ సెమీస్‌లో ఇంకెంత సంచలనమవుతాడో..
*ఫార్వార్డ్ ఆటగాడు హ్యారీ కేన్ ఇంగ్లాండ్‌ను ఏమేరకు ఆదుకుంటాడన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచీ తన స్టయల్‌తో ఇంగ్లాండ్‌కు విజయాలు అందించడమే కాదు, ఇమేజ్ సైతం తీసుకొచ్చాడు.