క్రీడాభూమి

చైనా మాస్టర్స్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో ప్రణయ్, సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్జూ, ఏప్రిల్ 21: చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగం సింగిల్స్‌లో ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించారు. మలేసియా ఆటగాడు డారెన్ లియోతో తలపడిన ప్రణయ్ 21-10, 21-15 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు. సింధు 21-9, 21-17 స్కోరుతో చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ హుయ్ యూపై సునాయాసంగా విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ 21-12, 21-12 స్కోరుతో షీ పెయ్ చెన్, ఊ తీ జన్ జోడీని ఓడించింది. కాగా, పుషుల డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దివాల్కర్ జోడీ ఓటమిపాలై నిష్క్రమించింది. వీరిపై వాంగ్ ఇల్యూ, జాంగ్ వెన్ జోడీ 21-17, 21-12 తేడాతో గెలిచింది.

వ్యాపార ప్రకటన
షూటింగ్‌లో సైనా బిజీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒక వ్యాపర ప్రకటన షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి కూరగాయలతో నిండిన ఒక టేబుల్ వద్ద నిలబడిన ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. కాలి మడమ గాయం కారణంగా కొద్దికాలంగా ఫామ్‌ను కొనసాగించలేకపోతున్న సైనా పలు టోర్నీలకు గైర్హాజరువుతున్నది. చాంగ్జూలో జరుగుతున్న చైనా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ సూపర్ సిరీస్ నుంచి కూడా ఆమె వైదొలగింది. ఫిట్నెస్ సమస్యతో లభించిన తీరిక సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటున్నది.

ఫిట్నెస్ పరీక్ష సమయంలో
యువ క్రికెటర్ మృతి
జొహానె్నస్‌బర్గ్, ఏప్రిల్ 21: దక్షిణాఫ్రికాకు చెందిన ఒక యువ క్రికెటర్ ఫిట్నెస్ పరీక్ష జరుగుతుండగా హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. లుఖన్యా సికీ అనే 22 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఫోర్డ్ అకాడెమీలో శిక్షణ పొందుతున్నాడు. ఫిట్నెస్ పరీక్షకు హాజరైనప్పుడు అతను హఠాత్తుగా కిందపడ్డాడని, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారని అధికారులు తెలిపారు. గుండె పోటుతో అతను మరణించాడని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారని, పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత వివరాలు తెలుస్తాయని తెలిపారు.

డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్
‘చినా’ హఠాన్మరణం
కాలిఫోర్నియా, ఏప్రిల్ 21: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (డబ్ల్యుడబ్ల్యుఇ) రంగంలో ‘చినా’గా అందరికీ తెలిసిన మహిళా రెజ్లర్ జువాన్ లారెస్ కాలిఫోర్నియాలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందింది. అనారోగ్య సమస్యలుగానీ, ఇతరత్రా కారణాలుగానీ ఆమెకు లేవు. ఆమె హఠాన్మరణం పట్ల డబ్ల్యుడబ్ల్యుఇ ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రపంచ టైటిల్ సాధించిన ఏకైక మహిళా డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన చినా తన కెరీర్‌ను ముగించిన తర్వాత బాడీ బిల్డింగ్ మోడల్‌గా కొనసాగుతున్నది. 1999లో మొదటిసారి, 2000 సంవత్సరంలో రెండోసారి ఆమె ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2001లో 231 రోజుల పాటు ఆమె ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. చినా మృతి పట్ల పలువురు రెజ్లర్లు, డబ్ల్యుడబ్ల్యుఇ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.