క్రీడాభూమి

ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు పీవీ సింధు, ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 11: భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, హెచ్.ఎస్.ప్రణయ్ ఇక్కడ జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ మహిళలు, పురుషుల సింగిల్స్ విభాగాల్లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఓపెనింగ్ రౌండ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత సింధు మహిళల విభాగంలోని బల్గేరియా క్రీడాకారిణి లిండా జెట్‌ఛిరిని 21-8, 21-15 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు హాంకాంగ్‌కు చెందిన ఇప్ పుయ్ ఇన్‌తో తలపడుతుంది. ఇక మోచేతి గాయంతో చికిత్స పొందుతూ కోలుకున్న తర్వాత ఆడుతున్న పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ స్పెయిన్ క్రీడాకారుడు పాబ్లో అబియాన్‌ను 21-16, 21-19 తేడాతో ఓడించాడు. గురువారం జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ నాలుగో సీడ్ భారత క్రీడాకారుడు ప్రణయ్ ఇండోనేషియాకు చెందిన సోనీ డ్వి కున్‌కొరొతో పోటీపడతాడు.