క్రీడాభూమి

చెప్పలేనంత... ఆనందంతో డెస్‌చాంప్స్ ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 11: ‘చెప్పలేనంత ఆనందానికి గురవుతున్నా’ అని ఫ్రాన్స్ కోచ్ డిడెర్ డెస్‌చాంప్స్ వెల్లడించాడు. బెల్జియంపై అపూర్వ విజయంతో ఫిఫా ఫుట్‌బాల్ ఫైనల్‌కు చేరడంపట్ల తాను, జట్టుమొత్తం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నారు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకునేది లేదని, 2016 యూరోలో ప్రదర్శించిన ఆట ప్రావీణ్యం కంటే మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తామన్నారు. సొంత గడ్డ పారిస్‌లో జరిగిన 2016 యూరో క్లబ్‌లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ 2-0 స్కోరుతో ఒడిపోవడం తెలిసిందే. ‘పైనల్లో మాదే విజయం. ఇందులో ఎలాంటి సదేహాలు లేవు. జట్టు పటిష్టంగా ఉంది’ అని వ్యాఖ్యానించాడు. సామ్యూల్ ఉమ్టిటి సాధించిన హెడర్‌తో బెల్జియం జట్టుపై ఫ్రాన్స్ విజయం సాధించటం తెలిసిందే. ‘నిజానికి బెల్జియంను నియంత్రించడం అంత సులువు కాదు. అందుకే నా సిబ్బందికి, జట్టు ఆటగాళ్లకు హ్యాట్సాఫ్.