క్రీడాభూమి

పట్టాలెక్కే ప్రయత్నాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 21: దాదాపుగా ఒక రకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తిరిగి పట్టాలెక్కేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. దీనితో పోరు తీవ్ర స్థాయిలో సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇరు జట్లు టోర్నీని విజయాలతో ఆరంభించాయి. ఎవరూ ఊహించని విధంగా ఫామ్‌ను కోల్పోయాయి. వరుసగా రెండు పరాజయాలను చవిచూశాయి. రెండు జట్లలోనూ సమర్థులైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. నిలకడ లేమి ఇరు జట్లను సమానంగా బాధిస్తున్నది. ఫలితంగా గెలిచే మ్యాచ్‌లను కూడా చేజార్చుకున్నాయి. దీనితో శుక్రవారం నాటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. తిరిగి ఫామ్‌లోకి రావడానికి రెండు జట్లు ఈ మ్యాచ్‌నే వేదికగా ఎంచుకున్నాయి.
ఇలావుంటే, పరిమిత ఓవర్లు, టెస్టు ఫార్మెట్స్‌లో టీమిండియాకు జట్లకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య నెలకొన్న పరోక్ష యుద్ధం కూడా ఆసక్తిని రేపుతోంది. చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్‌ని పుణె, బెంగళూరు మధ్య పోటీగా కాకుండా ధోనీ, కోహ్లీ మధ్య జరిగే సమనంగా భావిస్తున్నారు. భవిష్యత్ కెప్టెన్‌గా ముద్రపడిన కోహ్లీతో, ఇప్పట్లో రిటైర్ కానంటూ భీష్మించుకున్న ధోనీకి ప్రచ్ఛన్న యుద్ధం ఉందన్న వాదన చాలకాలంగా వినిపిస్తున్నది. టీమిండియా కూడా రెండు వర్గాలుగా చీలిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. అలాంటిదేమీ లేదని జట్టు మేనేజ్‌మెంట్ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ, అభిమానుల్లో అనుమానాలు తీరడం లేదు. దీనితో పుణె, బెంగళూరు మ్యాచ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ధోనీ నాయకత్వంలోని పుణెలో ఆజింక్య రహానే, కెవిన్ పీటర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, మిచెల్ మార్ష్, ఇశాంత్ శర్మ, రజత్ భాటియా వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్లంప్ చాలాకాలంగా కొనసాగుతున్నది. అతను పామ్‌లోకి వస్తే పుణె మరింత బలపడుతుంది. కాగా, కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరులో షేన్ వాట్సన్, ఎబి డివిలియర్స్, కేన్ రిచర్డ్‌సన్, హర్షల్ పటేల్ వంటి సమర్థులున్నారు. యువ బ్యాట్స్‌మన్ సర్ఫ్‌రాజ్ ఖాన్ ఈ జట్టుకు లభించిన కొత్త ఆయుధం. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన భార్య ఆడ పిల్లకు జన్మనివ్వడంతో స్వదేశానికి వెళ్లాడు. ఫామ్‌లో లేని అతను జట్టులో లేని లోటు కనిపించకపోవచ్చు. మొత్తం కాగితంపై చూస్తే రెండు జట్లు సమవుజ్జీగా కనిపిస్తున్నాయి. ఫలితంగా పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.