క్రీడాభూమి

ఓడి గెలిచారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 12: ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్‌లో ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ, అసాధారణ ప్రతిభ కనబరచి సెమీ ఫైనల్ వరకూ చేరడమే అద్భుతమని ప్రశంసిస్తున్నారు. జట్టు స్వదేశానికి చేరుకున్నప్పుడు, కనీవినీ ఎరుగని రీతిలో ఆహ్వానం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెమీ ఫైనల్‌లో ఓడడం నిరాశపరచినప్పటికీ, ఆ స్థాయి వరకూ చేరడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారని ఇంగ్లాండ్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం నాటి మ్యాచ్‌ని లండన్‌లోని హైడ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన జెయింట్ స్క్రీన్‌పై సుమారు 30,000 మంది అభిమానులు వీక్షించారు. ఇక దేశ వ్యాప్తంగా టీవీల్లో ఈ మ్యాచ్‌ని తిలకించిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. హోరాహోరీగా సాగిన పోరులో క్రొయేషియా గెలవడం హైడ్ పార్క్‌లో భారీగా హాజరై, మ్యాచ్‌ని చూసిన వేలాది మంది అభిమానులను నిరాశకు గురి చేసింది. సాధారణ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఏదైనా టోర్నీలో ఓడితే, ఇంగ్లాండ్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. వీరాభిమానులు చెలరేగిపోతారు. నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతాయి. భారీగా ఆస్తి నష్టం అక్కడ ఆనవాయితీ. కానీ, వరల్డ్ కప్ సెమీస్‌లో ఓడినప్పుడు పరిస్థితి మరో రకంగా కనిపించింది. అభిమానులు డీలా పడినప్పటికీ, సెమీస్ వరకూ చేరడమే ఒక అద్భుతంగా అభివర్ణించారు. ఆటగాళ్లంతా చాలా కష్టపడ్డారని, ఓడినప్పటికీ వారు చూపిన పోరాట పటిమ అద్భుతమని వ్యాఖ్యానించారు. 3చాలా విచారంగా ఉంది. నిజంగానే బాధపడ్డాను. కానీ, జట్టును చూసి నూటికి నూరు శాతం గర్వ పడుతున్నాను. గొప్పగా పోరాడారు2 అని 31 ఏళ్ల లారా రుసన్ వ్యాఖ్యానించగా, 28 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌ను సెమీస్ వరకూ చేర్చిన ఆటగాళ్లు ప్రశంసలకు పాత్రులని 23 ఏళ్ల మరాద్ హుసేనొవ్ అన్నాడు. 1990లో అప్పటి పశ్చిమ జర్మనీ చేతిలో వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ ఓడిన విషయాన్ని 48 ఏళ్ల ఐటీ నిపుణుడు షాన్ బెయిలీ గుర్తుచేస్తున్నాడు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఇంగ్లాండ్‌ను సెమీస్ చేర్చిన జట్టులోని ప్రతి ఒక్కరినీ యావత్ దేశం అభిమానిస్తున్నదని అన్నాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్ పరాజయాన్ని ఎదుర్కోవడం సహజంగానే అభిమానులందరినీ బాధిస్తుందని, అయితే, అదే సమయంలో ఈ టోర్నీ మొత్తం మీద చూపిన పోరాటపటిన, కనబరచిన ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరినీ గర్వంతో తలెత్తుకునేలా చేస్తున్నదని బెయిలీ వ్యాఖ్యానించాడు. చాలా మంది అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. మొత్తం మీద ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీస్‌లో ఓడినప్పటికీ, అభిమానుల దృష్టిలో మాత్రం విజేతగా నిలిచింది.

చిత్రం..
క్రొయేషియా చేతిలో ఓటమిపాలై, వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్ నుంచి వెనుదిరిగామన్న బాధలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు