క్రీడాభూమి

బెస్ట్ వరల్డ్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 13: ఇదే ‘బెస్ట్ వరల్డ్ కప్’ అంటూ ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటినో ఆనందం వ్యక్తం చేశాడు. ‘సాకర్ పోరుకు వేదికలిచ్చిన రష్యన్లకు కృతజ్ఞతలు. పోరు సాఫీగా సాగేందుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. మ్యాచ్‌లు చూడ్డానికి రావడమే కాదు, వచ్చి వాలంటీరిజం ప్రదర్శించిన ప్రపంచ అభిమానులకు నమస్కారాలు’ అంటూ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేశాడు. టోర్నీ విజయవంతం కావడానికి భౌతికంగా, సాంకేతికంగా అన్ని విధాలా సహకరించిన రష్యాను, మ్యాచ్‌ల్లో పారదర్శకతకు సహకరించిన వార్ (వీడియో అసిస్టెంట్ రిఫరీ)ను అభినందనల్లో ముంచెత్తారు. ‘రష్యా వేదికగా సాగిన టోర్నీతో ప్రపంచకప్ దృక్ఫధమే మారిపోయింది’ అని ఇన్ఫాంటినో కితాబునిచ్చారు. ఫుట్‌బాల్ క్రీడలో వార్ ప్రాధాన్యతను వివరిస్తూ ‘అందరూ అంటున్నట్టు, అనుకుంటున్నట్టు ఫుట్‌బాల్ క్రీడను వార్ మార్చలేదు, ఏమార్చలేదు. పారదర్శక స్థితికి చేర్చింది’ అన్నారు. ఇప్పుడిక వార్‌లేని ఫుట్‌బాల్‌ను ఊహించలేమంటూ ప్రశంసించారు. విజయానికి ఉరకలేస్తున్న క్రొయేషియాను అభినందిస్తూ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోందని అన్నారు.

చిత్రం..రష్యా అధ్యక్షుడు మెద్వదేవ్‌తో ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో