క్రీడాభూమి

భలే ఆనందం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్రెట్, జూలై 13: పసికూనగా ప్రపంచకప్ బరిలోకి దిగి కసికూనగా ఫైనల్‌లో ఫ్రాన్స్‌తో కలపడబోతున్న జట్టును చూసి క్రొయేషియన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని నుంచి సాధారణ పౌరుడి వరకూ ఆటగాళ్ల మాదిరి జర్సీలు ధరించి, తామే ఆటగాళ్లమన్నట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మజీ చాంపియన్లు జర్మనీ, బ్రెజిల్‌వంటి మేటి జట్లను ఇంటికి పంపించి, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఖంగు తినిపించిన క్రొయేషియా జట్టు ఫిఫా ప్రపంచకప్ పోరులో హీరో అనిపించుకుంటోంది. ‘మా ఆటగాళ్లు చరిత్రను తిరగరాస్తారు’ అంటూ 15న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పుడు క్రొయేషియన్లు లక్ష కళ్లేసుకుని ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌కు మేం సన్నద్ధం అన్నట్టు క్రొయేషియా ప్రధాని నుంచి మంత్రులు, మామూలు పౌరులు వరకూ జెర్సీలు ధరించి సందడి చేస్తున్నారు. గురువారం జరిగిన క్రొయేషియా కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని ఆండ్రెజ్ ఫ్లెంకోవిక్‌తోపాటు మంత్రులు క్రొయేషియా జెర్సీలు ధరించి దర్శనమిచ్చారు. ‘ఇంగ్లాండ్‌పై విజయమే మనం సాధించిన గొప్ప విజయం. ప్రపంచవ్యాప్తంగా క్రొయేషియాకు గుర్తింపు తెచ్చిన ఆటగాళ్లు మనకు గర్వకారణం. ఫైనల్లో క్రొయేషియా జట్టు అద్భుతం ఆవిష్కరించబోతోంది. సందడి చేయడానికి సన్నద్ధంగా ఉండండి’ అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రష్యాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా అధ్యక్షురాలు కొలింద జెర్సీతో స్టాండ్స్‌లో సందడి చేయడం తెలిసిందే.

చిత్రం..క్రొయేషియా జెర్సీతో కేబినెట్ భేటీలో ప్రధాని ఆండ్రెజ్