క్రీడాభూమి

ఇది స్వప్న సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: ‘ఇది నా చిరకాల వాంఛ. దాన్ని సాకారం చేసుకున్నా’ అంటూ అథ్లెట్‌గా తాను సాధించిన విజయాన్ని హిమదాస్ అభివర్ణించింది. అసోంలోని మారుమూల గ్రామానికి చెందిన తాను ఫుట్‌బాలర్‌గా కెరీర్ ప్రారంభించటం, తొలి భారత మహిళగా ప్రపంచ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించటం అన్నది తన క్రీడా ప్రయాణంలో ఓ చిరస్మరణీయమైన అంశమని స్పష్టం చేసింది. ఐఏఎఫ్‌ఎఫ్ అండర్ -20 అథ్లెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించిన పద్దెనిమిదేళ్ల హిమదాస్ క్రీడాకారణిగా తన సత్తాను చాటుకోవడంతోపాటు ప్రపంచస్థాయిలో భారతీయ క్రీడా పటిమను చాటిచెప్పింది. ఈ సందర్భంగా తన కుటుంబ పరిస్థితులను ప్రస్తావించిన హిమదాస్ తన తండ్రి రంజిత్‌దాస్‌కు రెండు బిగాల స్థలం ఉండేదని, తన తల్లి జునాలి గృహిణి మాత్రమేనన్నారు. ఆరుగురు సభ్యులు కలిగిన తన కుటుంబానికి ఈ అతి చిన్న స్థలమే జీవనాధారమని పేర్కొన్న ఆమె ‘నా కుటుంబ పరిస్థితులు ఏమిటో నాకు తెలుసు. వాటిని అధిగమించేందుకు మేమెంతగా కష్టపడ్డామో నా కళ్లలో ఇప్పటికీ మెదులుతోంది. కానీ, ఆ దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదోక ప్రత్యేకత ఇస్తాడు’ అని స్పష్టం చేసింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగావున్న సానుకూల ఆలోచనే తన బలమని, నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా తన కుటుంబానికి, దేశానికి ఏదో చేయాలన్న తపనే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఆమె నేరుగా ఫిన్‌లాండ్‌లోని థాంపేర్‌నుంచే మాట్లాడింది. మొదటినుంచీ హిమదాస్‌ది పట్టుదలతో కూడిన స్వభావం. ఆమె ఏదైనా చేయాలనుకుంటే ఎవరేమి చెప్పినా వినేది కాదని, అందుకు అవసరమైన దీక్షా దక్షతలతో ముందుకు వెళ్లడమే ధ్యేయంగా పని చేసేదని తండ్రి రంజిత్ తెలిపారు. తన కుమార్తె విజయాన్ని భారత దేశమంతా ఓ ఉత్సాహంగా జరుపుకుంటోందని ఆనందం వ్యక్తం చేశాడు. హిమ సాధించిన విజయంతో అసోంలోని ఆమె గ్రామం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత క్రీడాకారిణి హిమదాస్‌పై దేశం యావత్తూ ప్రశంసలు కురిపిస్తోంది. అథ్లెటిక్స్‌లో భారత దిశా గమనాన్ని మార్చి స్వర్ణాన్ని సాధించిన హిమను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొదటి స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారణికి శుభాభినందనలు. ఆమె విజయం భారత్‌కు గర్వకారణం. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించే దిశగా ఆమె కృషి సాగాలి’ అంటూ రాష్టప్రతి, ప్రధాని ట్వీట్ చేశారు. ఫిన్లాండ్‌లోని టాంపెరేలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగు ఫైనల్లో 51.45 సెకండ్లలో గమ్యాన్ని చేరుకుని హిమదాస్ స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫేడరేషన్ (ఐఏఏఎస్) వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో హిమ చరిత్ర సృష్టించిందంటూ కేంద్ర మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, అసోం, పశ్చిమ బెంగాల్ సీఎంలు సర్భానంద సోన్వాల్, మమతా బెనర్జీలు అభినందించారు.