క్రీడాభూమి

రెండైతే ఖాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: సెర్బియాలో జరుగుతున్న 36వ గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వోజ్వోదినా యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించడం ఖాయమని భారత బాక్సర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 56 కేజీల విభాగంలో ఆకాష్ కుమార్, 69 కేజీల విభాగంలో లలిత ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. మాంటెనెజిరోకు చెందిన ఎడిన్ అల్కోవిక్‌పై 4-1 తేడాతో ఆకాష్ కుమార్ విజయం సాధిస్తే, రష్యా బాక్సర్ విక్టోరియా బివేరాను 5-0తో మట్టికరిపించి భారత బాక్సర్ లలిత సెమీస్‌కు దూసుకెళ్లింది. పురుషుల 69 కేజీల విభాగంలో జరిగిన పోటీలో విజయ్‌దీప్ 5-0తో రొమేనియాకు చెందిన మారియస్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 60 కేజీల విభాగంలో జరిగిన పోరులో అంకిత్ 5-0తో కజకిస్తాన్‌కు చెందిన బెక్ స్పాండియర్‌పై, 75 కేజీల విభాగంలో నితిన్ కుమార్ 4-1 తేడాతో రొమేనియా బాక్సర్ సిమోన్ ప్లోరిన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.