క్రీడాభూమి

వెన్నులో వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: అద్భుతమేదీ జరక్కపోతే శనివారం లార్డ్స్‌లో జరగనున్న రెండో వనే్డతో టీమిండియా మరో సీరిస్ సొంతం చేసుకోవడం ఖాయం. ఇప్పటికే టీ-20 సిరీస్‌ను సాధించి, తొలి వనే్డలో ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్, ఈ టూర్‌లో మరో ఘనమైన రికార్డు నమోదు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. చైనామన్ కుల్దీప్‌ను కట్టడి చేస్తే ఇంగ్లాండ్ సాధించే ఫలితం మరోలా ఉండేచ్చేమోగానీ, లేదంటే చావుదెబ్బ తప్పదన్నది క్రికెట్ పండితుల అంచనా. ట్రెంట్ బ్రిడ్జిలో గురువారం పోరులో ఒకవైపు బౌలర్లు, మరోవైపు బ్యాట్స్‌మన్లు చెలరేగిపోవడంతో తొలి వనే్డ భారత్ పరమైంది. ఫాంలోవున్న టీమిండియా గత ఆదివారం 2-1 స్కోరుతో టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకోవడాన్ని మర్చిపోలేం. అదే ఆదివారం వనే్డ సిరీస్‌నూ కైవసం చేసుకునే అవకాశం భారత్‌కు మిస్సైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరుగుతుండటంతో, ఇంగ్లాండ్ -్భరత్ వనే్డ ఫైనల్‌ను శనివారానికి మార్చడం తెలిసిందే. అయితే, ఒక్కరోజు తేడాతో ఇంగ్లాండ్‌కు కలిసొచ్చేదేమీ లేదని, భారత బౌలర్లను కట్టడి చేయడం ఇంగ్లాండ్‌కు సాధ్యంకాకపోవచ్చని అంటున్నారు. మాంచెస్టర్‌లో డ్రై పిచ్‌మీద కుల్దీప్ రిస్ట్ స్పిన్ దెబ్బకు చేదు అనుభవాన్ని చవిచూసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్లు, మరోసారి అదే పరిస్థితి ఎదుర్కోక తప్పదన్న అంచనాలే బలంగా వినిపిస్తున్నాయి. ఓల్డ్ ట్రఫోర్డ్ మ్యాచ్‌లోనూ తనకు అనుకూలించిన చల్లటి వాతావరణంలో కుల్దీప్ సత్తాచాటి టీమిండియాకు పెద్ద ఊతమిచ్చాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆప్షన్‌కు ఇంగ్లాండ్ దూరంగాఉండి, భారత బ్యాట్స్‌మన్ల లైనప్‌కు కుప్పకూలిస్తే తప్ప ఫలితాలు మారే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. సంచలనం సృష్టించాలన్న కసితో భారత్.. సిరీస్‌ను చేజార్చుకోకూడదన్న వ్యూహంతో ఇంగ్లాండ్.. రెండు జట్లూ శుక్రవారం లండన్ బయలుదేరాయి. కుల్దీప్ దెబ్బకు జేసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్, జానీ బెయిర్‌స్టో, జోయ్ రూట్‌లు సైతం విఫలమవుతున్నారు. ఈ పరిస్థితులే ఇంగ్లాండ్ బ్యాంటింగ్ సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచలేకపోతున్నాయి. గూగ్లీస్, షార్ప్ లెగ్ బ్రేక్‌తో ఇంగ్లాండ్ బ్యాంటిగ్ లైనప్‌ను భారత బౌలర్లు కుప్పకూలుస్తున్న నేపథ్యంలో, ఈసారి జాస్ బట్లర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకుతెచ్చే యోచన చేస్తోంది ఇంగ్లాండ్.
కొత్త బంతి ఉండగానే స్కోరు చక్కబెట్టే వ్యూహంతో ఇంగ్లాండ్ సారథి మోర్గాన్ ఈసారి బట్లర్‌ను మూడోస్థానంలో దించొచ్చన్నది అంచనా. ఒకవైపు అలెక్స్ హేల్స్ జట్టుకు దూరమవ్వడం, మరోపక్క పిచ్ పరిస్థితులు అననుకూలంగా ఉంటుండటంతో ఇంగ్లాండ్ దూకుడు ప్రదర్శించగలదా? అన్న సందిగ్దం లేకపోలేదు. ఇదిలావుంటే, 2016 ఆస్ట్రేలియా టూర్ తరువాత రెండు వనే్డల సిరీస్‌ల్లో భారత్‌కు ఎదురులేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తితే తప్ప, లార్డ్స్ మైదానంలో టీమిండియా విఫలమయ్యే పరిస్థితే లేదు. టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో, తొలి వనే్డ మాదిరే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ స్టాండ్ మార్చే కొత్త నిర్ణయాలేవీ యాజమాన్యం తీసుకోకపోవచ్చు. దీన్నిబట్టి చూస్తే నోట్టింగమ్ నుంచి లండన్‌కు సౌకర్యంగా ప్రయాణం చేసినట్టే, రెండో చివరి వనే్డలోనూ టీమిండియా సులువైన విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరు రోజుల ఇంగ్లాండ్ టూర్ పూర్తి చేసుకున్న టీమిండియా, మరో 24 గంటల్లో ఇంగ్లాండ్ గడ్డపై రెండో సిరీస్ విజయాన్ని నమోదు చేయగలదన్న ధీమా వ్యక్తమవుతోంది. వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకుంటే, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టేటస్సే మారిపోతుంది. అంతేకాదు, ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ భారత్ దూకుడుకు ఎదురులేకుండా పోతుందన్నది నిజం.