క్రీడాభూమి

కుల్దీప్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టీమిండియా మీద కాదు, ఇప్పుడు ఆడాల్సింది కుల్దీప్ మీద’ ఇదీ ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ అంతర్మథనం. కుల్దీప్ పేరు చెబితే ఇప్పుడు ఇంగ్లాండ్ వణుకుతుంది. ‘కుల్దీప్ బంతుల్ని అంచనా వేయడంపైనే దృష్టి పెట్టాం. ఓల్డ్ ట్రఫోర్డ్, కార్డ్ఫి మైదానాల్లో మాదిరిగానే లార్డ్స్‌లోనూ కుల్దీప్ చెలరేగొచ్చు. కానీ, గత రెండింటిలో అతని బంతుల్ని అలవాటుపడ్డాం. ఈసారి సమర్థంగానే ఎదుర్కొంటాం. అయితే, ఇది చెబుతున్నంత సులువుకాకపోవచ్చు. మేం ఆడి చూపించాలి’ అంటున్నాడు మోర్గాన్. ‘అతని ఆటలో పరిణితి కనిపిస్తోంది. నిజానికి కుల్దీప్ కారణంగా మా ఆట పదునుదేరుతోంది. అతన్ని అందరిగాటన కట్టలేం. ప్రపంచంలోని అద్భుతమైన చైనామన్ ఎడమచేతి బౌలర్‌గా అతన్ని పరిగణించాలి. ఆ క్రెడిట్ అతనికి ఇవ్వాల్సిందే. అతన్ని ఎదుర్కోవడంపైనే మా ఫలితాన్ని మేం లిఖించుకోవడం ఉంటుంది’ అంటున్నాడు మోర్గాన్.