క్రీడాభూమి

సర్‌ప్రైజ్‌లు ఉండొచ్చేమో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొట్టింగామ్, జూలై 13: ఇంగ్లాండ్‌తో త్వరలో మొదలయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ ‘కీ వెపన్స్’నే ప్రయోగించాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆశపడుతున్నాడు. ‘టెస్ట్ మ్యాచ్‌లకు ఆటగాళ్ల ఎంపిక సమయంలో ఏమైనా జరగొచ్చు. కాకపోతే కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయేమో. కుల్దీప్ మంచి ఫాంలో ఉన్నాడు. అలాగని చాహల్‌ను తక్కువ అంచనా వేయలేం’ అంటూ హింట్ ఇస్తున్నాడు కోహ్లీ. ‘కానీ, ఇప్పుడు మా ఫోకస్ అంతా మిగిలిన రెండు వనే్డలపైనే ఉంది. ముఖ్యంగా సిరీస్ సొంతం చేసుకునే విషయంలో రెండో వనే్డ మాకు కీలకం. ఈ టూర్ పెద్దదే కాదు, టీమిండియా ఆటకు పరీక్ష కూడా’ అంటున్నాడు కోహ్లీ. ‘టెస్ట్ మ్యాచ్ టీంలో చోటుకోసం నాకు పిలుపు వస్తుందనే అనుకుంటున్నా. ఏం జరగుతుందోనన్న ఆదుర్దా నాలోనూ ఉంది. మరో రెండురోజుల్లో దీనికి ఫుల్‌స్టాప్ పడొచ్చు’ అన్నాడు స్పిన్ మాంత్రికుడు కుల్దీప్. ఇంగ్లాండ్ మైదానాల్లో నా ఆట తీరు సంతృప్తినివ్వడం కాదు, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ కుల్దీప్ ముక్తాయంపు ఇవ్వడాన్ని చూస్తుంటే అతనికి బెర్త్ ఖాయమని తెలుస్తుంది. టూర్‌లో రాణిస్తున్న యజువేంద్ర చాహల్‌కూ అవకాశం కల్పించొచ్చని అంచనా.