క్రీడాభూమి

థాయ్ సెమీస్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్: వరుస టోర్నమెంట్‌లో పూర్తిగా విఫలమైన భారత స్టార్ షట్లర్ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌కు ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 21-17, 21-13 స్కోరు తేడాతో మాలేసియాకు చెందిన వరల్డ్ నంబర్ 35 క్రీడాకారిణి సోనియా చేహాపై విజయం సాధించింది. వరల్డ్ నంబర్ టూ క్రీడాకారిణి సింధు 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై మొదటి నుంచి ఆధీపత్యాన్ని కనపరించింది. అంతకు ముందు జరిగిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-16, 21-14 స్కోరుతో హాంకాంగ్‌కు చెందిన యిప్ పుయ్ యిన్‌పై విజయం సాధించింది. మలేసియా, ఇండోనేసియాలో జరిగిన టోర్నమెంట్‌లో కేవలం మొదటి, రెండో రౌండ్‌కు పరిమితమైన సింధు ఈ టోర్నీలో అద్భుతమైన ఆటతీరును ప్రధర్శిస్తోంది. దీంతో ఈ టోర్నమెంట్‌లో సింధుకు తప్పకుండా పతకం సాధించడం ఖాయం.