క్రీడాభూమి

రెండో వనే్డలో ఇంగ్లాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: భారత్‌తో శనివారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదటి వనే్డలో ఓటమిపాలైన ఈ జట్టు రెండో మ్యాచ్‌లో ఎదురుదాడికి దిగింది. జో రూట్ సెంచరీ (113), ఇయాన్ మోర్గాన్ (53), డేవిడ్ విల్లే (50) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 322 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ 68 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య, యుజువేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. సురేష్ రైనా (46) కొద్దిసేపు ఇంగ్లాండ్ బౌలర్లను ఎదురించినా ఫలితం లేకపోయింది. లియామ్ ప్లెంకెట్ 46 పరుగులకు నాలుగు వికెట్లు సాధించి భారత్‌ను దెబ్బతీశాడు. డేవిడ్ విల్లే, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో వనే్డ ఈనెల 17వ తేదీన లీడ్స్ మైదానంలో జరుగుతుంది.

చిత్రం..సురేష్ రైనా వికెట్ తీసిన ఆనందంతో ఇంగ్లాండ్ జట్టు