క్రీడాభూమి

ఫిన్చ్ వీరబాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: ఏడు సిక్సర్లు. పది ఫోర్లు. 79 బంతుల్లో 131 పరుగులు. ఇంగ్లీష్ క్రికెట్స్ బ్లాస్ట్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫిన్చ్ మెరుపులివి. టీ-20 చరిత్రలో 79 బంతుల్లో 131 పరుగులు సాధించిన నాటౌట్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. హోవ్‌లో జరిగిన కంట్రీ క్రికెట్‌లో ఇంగ్లీష్ జట్టుతో చెడుగుడు ఆడిన ఫిన్చ్, 52 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. నిజానికి రెండో ఓవర్ తొలి బంతికే ఫిన్చ్ తిరుగుముఖం పట్టాల్సింది. సస్సెక్స్ పేసర్ జాఫ్రా ఆర్చర్‌కు సులువుగా అందిన క్యాచ్ మిస్ చేయడంతో, ఫిన్చ్ మరో చాన్స్ ఇవ్వలేదు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు, ఆస్ట్రేలియా స్కోరు దరిదాపులకు సైతం చేరలేకపోయింది. 140 పరుగుల వద్దే 18 ఓవర్లలో వికెట్లను పోగొట్టుకుని ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది. 50 బంతుల్లో సెంచురీ పూర్తి చేసిన ఫిన్చ్, ఓల్లీ పోప్ (23 నాటౌట్) భాగస్వామ్యంతో 192 పరుగుల వద్ద ఆస్ట్రేలియాను అజేయంగా గెలిపించాడు.