క్రీడాభూమి

చెలరేగిన సౌరెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఏప్రిల్ 21: స్పానిష్ సాకర్ లీగ్ ‘లా లిగా’లో భాగంగా గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలను చవిచూసిన బార్సిలోనా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. డిపోర్టివో లా కొరునాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 8-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. లూయిస్ సౌరెజ్ ఏకంగా నాలుగు గోల్స్ సాధించగా, ఇవాన్ రాకిటిక్, లియోనెల్ మెస్సీ, మార్క్ బర్‌త్రా, నేమార్ తలా ఒక గోల్ చేశారు. బార్సిలోనా విజృంభణకు డిపోర్టివో ఆటగాళ్ల నుంచి ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్ 11వ నిమిషంలోనే గోల్ సాధించిన సౌరెజ్ తిరిగి 24వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 47వ నిమిషంలో రాకిటిక్ గోల్ చేయగా, మరోసారి సౌరెజ్ విజృంభణ కొనసాగింది. 53, 64 నిమిషాల్లో అతను గోల్స్ నమోదు చేశాడు. 73వ నిమిషంలో మెస్సీ, 79వ నిమిషంలో బర్‌త్రా, చివరిగా 81వ నిమిషంలో నేమార్ గోల్స్ చేశారు. చాలాకాలం తర్వాత బార్సిలోనా ఫామ్‌లోకి రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, వలెన్షియా జట్టు 4-0 తేడాతో ఎబార్‌ను ఓడించింది. ఫాల్కాస్ 10, 28, 40 నిమిషాల్లో గోల్స్ చేయగా, కానె్సలో 56వ నిమిషంలో గోల్ చేశాడు. ఎబార్ ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. అట్లెటికో మాడ్రిడ్ 1-0 తేడాతో అట్లెటికో బిల్బావోను ఓడించింది. మ్యాచ్ 38వ నిమిషంలో టోరెస్ కీలక గోల్ చేసి అట్లెటికో మాడ్రిడ్‌ను గెలిపించాడు. విల్లారియల్ జట్టుపై రియల్ మాడ్రిడ్ 3-0 ఆధిక్యంతో విజయం సాధించింది. బెంజిమా 41, లుకాస్ 69, మోడ్రిక్ 76 నిమిషాల్లో గోల్స్ చేశారు.