క్రీడాభూమి

ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫా ప్రపంచకప్‌లో ఆదినుంచీ అద్భుతాలు, సంచలనాలు నమోదవుతున్న తరుణంలో ఫ్రాన్స్‌తో ఫైనల్ ఆడనున్న పసికూన ఎలాంటి సంచలనాన్ని నమోదు చేస్తుందోనన్న ఉత్కంఠ సాకర్ అభిమానులను వెంటాడుతోంది. 68ఏళ్ల చరిత్రలో అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన క్రొయేషియా ఇవాన్ పెరిసిక్, రాకిటిక్‌లపైనే కొండంత ఆశలు పెట్టుకుంటే, ఫ్రాన్స్ మాత్రం ఎంబప్పె, గ్రీజ్‌మన్‌ల చాకచక్యంపై ధీమా వ్యక్తం చేస్తోంది. పోరులో ఎవరు నెగ్గినా ప్రపంచకప్ 2018 ఒక సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు.
*
మాస్కో, జూలై 14: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో గత నెల రోజుల్లో 63 గేమ్‌లు ముగిశాయి. ఇక ఆదివారం జరిగే క్లైమాక్స్‌తో ముగింపు పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరులో ఫ్రాన్స్, క్రొయేషియా హోరాహోరీగా తలపడనున్నాయి. 1930 నుంచి ఇప్పటివరకు 15సార్లు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఆడిన ఫ్రాన్స్ 1998లో ఘన విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్ మరోసారి టైటిల్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది. 2006 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్నా ఇటలీపై 5-3 తేడాతో ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొనే్నళ్లపాటు ఫైనల్‌కు చేరుకోని ఫ్రాన్స్ ఈ ఏడాది జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం క్రొయేషియాతో జరిగే అత్యంత కీలకమైన మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా భారీ అంచనాలతో దిగుతోంది. ఈ జట్టులో యువ స్టార్ సంచలనం కిలియాన్ ఎంబప్పె, ఆంటోనీ గ్రీజమన్ సంచలనం సృష్టించి మరోసారి ప్రపంచ కప్‌ను అందిస్తారనే బలంగా నమ్ముతోంది.
లీగ్ దశ నుంచి ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్ జట్టులో మొత్తంగా ఎక్కువ మంది యువకుల సమాహారంగా ఉంది. ఈ జట్టులోని కీలక ఆటగాడు ఎంబప్పె ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియాను ధీటుగా ఎదుర్కోగల సత్తా ఉన్నా ప్రత్యర్థి జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. లీగ్ దశ నుంచి క్రొయేషియా బలమైన జట్లను సైతం ఢీకొంటూ ఫైనల్‌కు అప్రతిహతంగా దూసుకువచ్చిందంటే ఆ జట్టు ఆటగాళ్లు అన్ని విభాగాల్లో ఎంతగా రాణిస్తున్నారో ఇట్టే అర్ధమవుతుంది.
ఇదిలావుండగా, తమ జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరాలని తాను కన్న కల ఇపుడు నెరవేరిందని ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ బ్లెసీ మటూడీ అన్నాడు. తమ జట్టులోని సంచలన ఆటగాడు ఎంబప్పె అర్జెంటీనాతో జరిగిన ఒక మ్యాచ్‌లో 4-3తో జట్టును గెలిపించే బాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నాడనని, అతను ఇపుడు క్రొయేషియాతో జరిగే ఫైనల్‌లో మళ్లీ మరోసారి తన ఆటతీరును ప్రదర్శించి, జట్టును విజయతీరాలకు చేర్చుతాడని తాము బలంగా నమ్ముతున్నామని పేర్కొన్నాడు. ఇక 1950 తర్వాత ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన అతి చిన్నదేశం ఉరుగ్వే మూడు గ్రూప్ మ్యాచ్‌లలో బలమైన జట్లు అర్జెంటీనా, డెన్మార్క్, రష్యాను మట్టికరిపించి, సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను సైతం దెబ్బతీసి ఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టు కోచ్ జ్లాట్కో డాలిక్ సమష్టి కృషి ఫలితమే ఫైనల్‌కు దారితీసేలా చేసిందని బలంగా నమ్ముతోంది. ఆదివారం బలమైన ఫ్రాన్స్‌తో జరిగే పోరు చాలా కష్టమైనా జీవితంలో తొలిసారిగా వచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని తాము జారవిడుచుకోలేదని, కష్టసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా ఆట ఆరంభం నుంచి పోరాడుతామని, ఇందుకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న మద్దతే తమను ఫైనల్ పోరులో గట్టెక్కిస్తుందని, ప్రపంచ కప్‌ను తొలిసారిగా ముద్దాడే కీర్తిప్రతిష్టలను తీసుకువస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

చిత్రాలు..రాకిటిక్.. *ఫ్రాన్స్ ఆటగాళ్ల ప్రాక్టీస్