క్రీడాభూమి

క్వీన్ కెర్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జర్మనీకి చెందిన ఏంజెలిక్ కెర్బర్ దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఆమె ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను 6-3, 6-3 తేడాతో ఓడించింది. కెరీర్‌లో 23 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్‌ను కైవసం చేసుకొని, మహిళా టెన్నిస్‌లో తిరుగులేని క్రీడాకారిణిగా పేరు సంపాదించిన సెరెనా గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకుంది. ఆతర్వాత తాను గర్భవతినని ప్రకటించి, టెన్నిస్‌కు విరామం ప్రకటించింది. సెప్టెంబర్‌లో కుమార్తెకు జన్మనిచ్చిన ఆమె ఈ ఏడాది మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టినప్పటికీ, గతంలో మాదిరి పూర్తి స్థాయిలో రాణించలేకపోయింది. దీనితో ఆమె కెరీర్‌కు తెరపడుతుందనే అనుమానాలు తలెత్తాయి. కానీ, క్రమంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సెరెనా వింబుల్డన్‌లో అద్వితీయ ప్రతిభాపాటవాలు కనబరచి, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 2016లో ఒకసారి ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ అందుకోలేక, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్న కెర్బర్‌పై సెరెనా సులభంగానే గెలుస్తుందని క్రీడాపండితులు జోస్యం చెప్పారు. కానీ, శనివారం నాటి తుది పోరు అందుకు భిన్నంగా, దాదాపు ఏకపక్షంగా సాగింది. కెర్బర్ వరుస సెట్లలో సెరెనాకు షాకిచ్చి, వింబుల్డన్‌లో మొదటిసారి, మొత్తం మీద మూడోసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకుంది. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను సాధించింది. రెండేళ్ల తర్వాత మరోసారి గ్రాండ్ శ్లామ్ విజేతగా నిలిచింది.